Homeక్రీడలుRavi Shastri | ధోనిని ర‌వి శాస్త్రి జేబు దొంగ‌తో పోల్చాడేంటి.. !

Ravi Shastri | ధోనిని ర‌వి శాస్త్రి జేబు దొంగ‌తో పోల్చాడేంటి.. !

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Ravi Shastri | భార‌త మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని Ms Dhoni క్రికెట్ చ‌రిత్ర‌లో త‌నకంటూ ప్ర‌త్యేక‌పేజి లిఖించుకున్న విష‌యం తెలిసిందే. రీసెంట్‌గా ధోనికి అరుదైన గౌర‌వం కూడా ల‌భించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చింది. ఈ గౌరవం పొందిన 11వ భారతీయుడిగా ఆయన నిలిచారు. క్రికెట్ చరిత్రలో తమ అమూల్యమైన సేవలు అందించిన దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో ధోనీ పేరు కూడా చేరింది. మూడు ప్రధాన ICC ట్రోఫీలను గెలుచుకున్నందుకు, అతని అద్భుతమైన కెప్టెన్సీకి ధోనీకి ఈ గౌరవం లభించింది. అతను 2007 T20 ప్రపంచ కప్, 2011 ODI ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలు భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్ ధోనీ.

Ravi Shastri | అలా అన్నాడేంటి..

ఈ క్ర‌మంలో లండ‌న్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ర‌విశాస్త్రి Ravi Shastri.. ధోనిపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ధోనీ చేతులు పిక్ పాకెటర్(Pickpocketer) కంటే వేగంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా భారత్‌లో.. ముఖ్యంగా అహ్మదాబాద్‌లోని ఒక పెద్ద మ్యాచ్‌కి వెళ్తే, మీ వెనుక ధోనీ ఉండకుండ చూసుకోండి. లేదంటే మీ పర్స్ మాయమైపోతుంది అని రవి శాస్త్రి అనగా అక్కడ నవ్వులు పూసాయి. ధోనీ వేగవంతమైన వికెట్ కీపింగ్‌(Wicketkeeping)ను ప్రశంసిస్తూ.. రవి శాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు. ధోనీ తన కెరీర్‌లో మెరుపు వేగంతో ఎన్నో స్టంపౌట్స్, రనౌట్స్ చేశాడు. ధోనీ ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఉంటాడని రవి శాస్త్రి కొనియాడాడు. ‘ధోనీ సున్నాకి ఔట్ అయినా.. ప్రపంచ కప్ గెలిచినా.. సెంచరీ కొట్టినా, డబుల్ సెంచరీ సాధించినా.. ఒకేలా ఉంటాడు. అతనిలో ఏ మాత్రం తేడా కనిపించదు.’అని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.

సచిన్ టెండూల్కర్ Sachin Tendulkarవంటి దిగ్గజాలు కూడా కొన్నిసార్లు కోపంగా ఉండేవారు, కాని ధోనీని నేను ఎల్లప్పుడూ బ్యాలెన్స్‌డ్‌గానే చూశాను.ప్రశాంత స్వభావం వేగవంతమైన వికెట్ కీపింగ్ మనసు గెలుచుకున్నాయి. ధోనీ కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన విషయం అతని ప్రశాంత స్వభావం, వేగవంతమైన వికెట్ కీపింగ్. అతను తన కెప్టెన్సీతో జట్టును కొత్త శిఖరాలకు చేర్చడమే కాకుండా, వికెట్ల వెనుక కూడా అనేకసార్లు అద్భుతాలు చేశాడు, ఇది మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేసింది. తన వికెట్ కీపింగ్‌తో ధోనీ అనేకసార్లు భారత జట్టుకు పెద్ద మ్యాచ్‌లు గెలిపించాడు . ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ పేరు హాల్ ఆఫ్ ఫేమ్‌(Hall of Fame)లో నమోదు చేయడంతో ఇది భారత క్రికెట్‌కు చాలా గర్వకారణం. ధోనీ సాధించిన ఈ చారిత్రాత్మక విజయం అతని అభిమానులకు మరొక మరపురాని క్షణం ఇచ్చింది.