Nizamabad City
Nizamabad City | నిజామాబాద్ నగరపాలక సంస్థ​ కమిషనర్​ బదిలీకి బ్రేక్​..!

అక్షరటుడే,ఇందూరు: Municipal Corporation | రాష్ట్రంలో భారీ సంఖ్యలో మున్సిపల్​ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు బదిలీ అయ్యారు. ఈమేరకు మున్సిపల్​ కార్యదర్శి శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​కు డిప్యూటీ కమిషనర్​ను కేటాయించారు. అమరచింతలో గ్రేడ్​–1 మున్సిపల్​ కమిషనర్​గా పనిచేస్తున్న రవిబాబును నిజామాబాద్ మున్సిపల్​ కార్పొరేషన్​ డిప్యూటీ కమిషనర్​గా బదిలీ చేశారు. అలాగే అసిస్టెంట్​ మున్సిపల్​ కమిషనర్​గా ఎంఏ నసీర్​ ప్రమోషన్​పై రానున్నారు. త్వరలో వీరిరువురు బాధ్యతలు స్వీకరించనున్నారు.