HomeజాతీయంRaveena Tandon | ఎయిర్ ఇండియాపై రవీనా టాండన్ ఫైర్.. కొందరు ప్రయాణికుల కన్నా పెంపుడు...

Raveena Tandon | ఎయిర్ ఇండియాపై రవీనా టాండన్ ఫైర్.. కొందరు ప్రయాణికుల కన్నా పెంపుడు జంతువులే న‌యం…

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: పెంపుడు జంతువులతో విమాన ప్రయాణం చేసే వారి పట్ల ఎయిర్ ఇండియా చూపుతున్న నిర్లక్ష్యాన్ని బాలీవుడ్ నటి Bollywood actress రవీనా టాండన్ Raveena తీవ్రంగా తప్పుపట్టారు.

ఈ విషయంలో ఆకాశ ఎయిర్ Aakash Air తీసుకున్న నూతన విధానాన్ని ప్రశంసిస్తూ, ఎయిర్ ఇండియా పాఠాలు నేర్చుకోవాలంటూ గట్టిగా విమర్శలు చేశారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) లో రవీనా స్పందిస్తూ..ఎయిర్ ఇండియా, దయచేసి చూడండి, నేర్చుకోండి! మీరు ఎన్నోసార్లు పెంపుడు జంతువుల యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే, మీరు ఎక్కించుకునే కొందరు మనుషులకంటే మా పెంపుడు జంతువులే మెరుగైన ప్రవర్తన చూపుతాయి,” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Raveena Tandon | ఆకాశ ఎయిర్ కొత్త పాలసీపై ప్రశంసలు

ఆకాశ ఎయిర్ తాజాగా ప్రవేశపెట్టిన విధానానికి అనుగుణంగా, ప్రతి విమానంలో రెండు పెంపుడు జంతువులు క్యాబిన్‌లో ప్రయాణించేందుకు అనుమతి ఉంది.

మరో పెంపుడు జంతువును కార్గోలో తరలించేందుకు వీలుగా మార్గం అందుబాటులో ఉంది.ఈ పాలసీ “సౌకర్యవంతమైనది, హృదయాన్ని తాకే నిర్ణయం” అంటూ రవీనా కొనియాడారు.

ఆసక్తికరంగా, కొన్ని నెలల క్రితం అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం Flight ప్రమాదానికి గురైనప్పుడు, అదే రవీనా టాండన్ సంస్థకు మద్దతుగా నిలిచి ..“అన్ని కష్టాలను ఎదుర్కొని మళ్లీ నిలబడింది” అంటూ సిబ్బందికి ఉత్సాహాన్నిచ్చారు. ఇప్పుడు అదే సంస్థపై ఇలా ఘాటుగా స్పందించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

సినీ రంగం విష‌యానికి వ‌స్తే.. ప్రస్తుతం రవీనా టాండన్ ‘వెల్కమ్ 3’ Welcome 3చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ Akshay Kumar, సంజయ్ దత్ Sanjay Dutt, అర్షద్ వార్సీ వంటి స్టార్లు కూడా ఉన్నారు.

అదే సమయంలో, పాలిటికల్ డ్రామా వెబ్‌సిరీస్ ‘డైనాస్టీ’ ‘Dynasty’ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సిరీస్‌ ద్వారా ఆమె మరోసారి తన నటనా ప్రతిభను చాటేందుకు సిద్ధమవుతున్నారు.

మొత్తానికి… పెంపుడు జంతువులపై ప్రేమను మరోసారి రవీనా టాండన్ బలంగా ప్రదర్శించారు. విమానయాన సంస్థలు కూడా మరింత బాధ్యతతో వ్యవహరించాలని ఈ సంఘటన స్పష్టంగా చెబుతోంది.