ePaper
More
    HomeతెలంగాణCollector Vinay Krishna Reddy | రేషన్ షాపులు.. మీసేవ కేంద్రాలను తనిఖీ చేయండి.. కలెక్టర్​...

    Collector Vinay Krishna Reddy | రేషన్ షాపులు.. మీసేవ కేంద్రాలను తనిఖీ చేయండి.. కలెక్టర్​ ఆదేశం..

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Collector Vinay Krishna Reddy | రేషన్ షాపులు.. మీసేవ కేంద్రం క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అధికారులకు ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పంపిణీ వ్యవస్థలో లోటుపాట్లకు తావు లేకుండా ఉండేందుకు క్షేత్రస్థాయిలో చౌక ధరల దుకాణాలను తనిఖీ చేయాలన్నారు. అన్ని రేషన్ షాపుల్లో (Ration Shops) పక్కాగా నిబంధనలు అమలయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు. మీసేవ కేంద్రాల్లో (Me Seva Centers) దరఖాస్తుదారుల నుంచి నిర్ణీత రుసుము మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అధిక డబ్బులు వసూలు చేసే కేంద్రాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

    Collector Vinay Krishna Reddy | భూభారతి రెవెన్యూ దరఖాస్తులు..

    భూభారతి రెవెన్యూ సదస్సు (Bhubharati Revenue Conference)లో వచ్చిన దరఖాస్తులను తొందరగా పరిష్కరించాలని కలెక్టర్ తహశీల్దార్లను ఆదేశించారు. క్షేత్రస్థాయి విచారణ నిర్వహిస్తూ.. నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తులను పరిష్కరించాలని, ఆగస్టు 14వ తేదీలోపు పరిష్కారమయ్యేలా చూడాలని తెలిపారు. అలాగే కొత్త రేషన్ కార్డులు (New Ration Cards), కొత్త సభ్యుల పేర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని, అనర్హులకు రేషన్ కార్డులు మంజూరు కాకుండా చూడాలన్నారు.

    Collector Vinay Krishna Reddy | ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితం

    ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Hoses) నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా జరిగేలా చూడాలన్నారు. డబ్బులు వసూలు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్​లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఎస్​వో అరవింద్ రెడ్డి, హౌసింగ్ శాఖ అధికారి నివర్తి, తహశీల్దార్లు పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...