Homeజిల్లాలుకామారెడ్డిSultan nagar | సుల్తాన్​నగర్​లో రేషన్ పంపిణీ ప్రారంభం

Sultan nagar | సుల్తాన్​నగర్​లో రేషన్ పంపిణీ ప్రారంభం

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్: Sultan nagar | నిజాంసాగర్​ మండలంలోని సుల్తాన్​నగర్ గ్రామంలో గురువారం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ రేషన్ పంపిణీని ప్రారంభించారు. గతంలో సుల్తాన్​నగర్​ వాసులు రేషన్​ కోసం నిజాంసాగర్ వరకు వెళ్లేవారు. ప్రభుత్వం మూణ్నెళ్ల రేషన్​ ఒకేసారి పంపిణీ చేస్తుండడంతో గ్రామస్థులు అక్కడకు వెళ్లడం ఇబ్బందిగా మారడంతో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు(MLA Thota Lakshmi Kantha Rao) పౌర సరఫరాల శాఖ అధికారులతో మాట్లాడారని మల్లిఖార్జున్​ పేర్కొన్నారు. దీంతో అధికారులు సుల్తాన్​నగర్​లో రేషన్​ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నారని​ వివరించారు. గ్రామంలోనే రేషన్​ అందజేస్తుండడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రేషన్​ డీలర్​ రహమాన్​, నాయకులు బ్రహ్మం, సాయిలు, బేతయ్య, హైమద్, చాంద్ పాషా, కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.

Must Read
Related News