అక్షరటుడే, లింగంపేట: Ration Shops | జిల్లాలో రేషన్ బియ్యం (ration rice) పంపిణీకి సిగ్నల్ అంతరాయం సృష్టిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా వారంరోజులు క్రితం వరకు భారీ వర్షాలు (heavy rains) కురియడంతో సిగ్నల్ వ్యవస్థ దెబ్బతిన్నది. దీంతో గ్రామాల్లో రేషన్ పంపిణీ వ్యవస్థకు (ration distribution system) తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దీంతో లబ్ధిదారులు గంటల తరబడి రేషన్‌షాపుల ఎదుట నిలబడాల్సి వస్తోంది.
Ration Shops | లింగంపేట మండలంలో..
లింగంపేట మండలం (Lingampeta mandal) కోమటిపల్లి గ్రామంలో సిగ్నల్ రాక లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో చేసేదేం లేక.. రేషన్‌డీలర్ రాజులు ఎత్తు ప్రదేశంలో ఉన్న బస్టాండ్‌లో ఎత్తైన ప్రాంతంలోని ప్రయాణ ప్రాంగణంలో సిగ్నల్ వచ్చే చోట రేషన్ బియ్యం (Ration Rice) బుధవారం పంపించేశారు. గ్రామాలు సిగ్నల్ వ్యవస్థను మెరుగుపరచాలని కోరుతున్నారు.