Homeజిల్లాలునిజామాబాద్​Mla Sudarshan reddy | అర్హులందరికీ రేషన్ కార్డులు

Mla Sudarshan reddy | అర్హులందరికీ రేషన్ కార్డులు

- Advertisement -

అక్షరటుడే, బోధన్: Mla Sudarshan reddy | అర్హులందరికీ రేషన్​ కార్డులు పంపిణీ చేస్తామని బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి అన్నారు. బోధన్​ (Bodhan) మండలం సాలూరలో (Salura) లబ్ధిదారులకు శుక్రవారం రేషన్​ కార్డులను (Ration Cards) పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. రేషన్​ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. అర్హలైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందిస్తామని స్పష్టం చేశారు. బోధన్ నియోజకవర్గానికి (Bodhan constituency) 6,600 రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.

ఇంకా ఎవరైనా అర్హత ఉన్నా కార్డులు రాని వారు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ (State Urdu Academy) ఛైర్మన్​ తాహెర్​బిన్​ హందాన్​, కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాహతో (Bodhan Sub-Collector Vikas Mahato), సివిల్ సప్లయ్స్ (Civil Supplies)​ జిల్లా అధికారి తదితరులు పాల్గొన్నారు.