HomeUncategorizedAp Ration Shops | ఇక ఇంటి వద్దకే రేషన్.. నేటి నుంచే అమలు

Ap Ration Shops | ఇక ఇంటి వద్దకే రేషన్.. నేటి నుంచే అమలు

- Advertisement -

అక్షరటుడే, అమరావతి : Ap Ration Shops : రేషన్ పంపిణీ(ration distribution)లో అక్రమాలు నిరోధించడానికి, కార్డుదారులు తమకు అవసరమైన సమయంలో తీసుకునేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం పాత విధానాన్ని మళ్లీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్​ సరకులు ఇచ్చేలా ఏర్పాటు చేసినా.. రేషన్​ డీలర్లు పట్టించుకోవడంలేదు. దీంతో గత నెలలో కొందరు లబ్ధిదారులు సరకులు తీసుకోలేకపోయారు.

ఈ విషయాన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం (AP government).. తాజాగా సదరు లబ్ధిదారుల(beneficiaries) వద్దకు అయిదు రోజుల ముందే సరకులు చేర్చేలా నిర్ణయం తీసుకుంది. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Ap Ration Shops : జిల్లా స్థాయిలో పర్యవేక్షణ

రేషన్​ దుకాణాల్లో(ration shops) జులై 1 నుంచి 15వ తేదీ వరకు డీలర్లు(Dealers) సరకులు పంపిణీ చేస్తారు. అంత కంటే ముందే అంటే జూన్ 26 నుంచి అయిదు రోజుల పాటు.. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకు వెళ్లి సరకులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Ap Ration Shops : పంపిణీ చేయకుంటే కఠిన చర్యలు..

ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. వందశాతం ప్రక్రియ పూర్తయ్యే చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. పక్కాగా అమలు ఈ నెల 26 నుంచి డీలర్లే స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ సరకులు ఇవ్వాల్సి ఉంది.

రేషన్​ దుకాణాలకు ఇన్​ఛార్జులుగా ఉన్న వారికి కూడా ఈ నియమం వర్తిస్తుంది. డీలర్లు ఎక్కడైనా ఇబ్బంది పెడితే వెంటనే తెలియజేయాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నారు. అర్హులైన లబ్ధిదారులు ఇంటివద్దే ఉండి సరుకులు పొందాలని అధికారులు సూచించారు.

Must Read
Related News