అక్షరటుడే, ఇందూరు: Neela Kanteswara Temple | మాఘ శుద్ధసప్తమి రోజు సూర్య భగవానుడిని స్తుతిస్తూ రథసప్తమి వేడుకలు (Ratha Saptami celebrations) ఆదివారం జిల్లాలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వరాలయంలో జాతర వైభవోపేతంగా చేశారు.
రథసప్తమి సందర్భంగా ఆలయ ప్రాంగణం నుంచి తల్లి గోరి గద్దె వరకు రథాన్ని ఊరేగించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. రథం ముందు పలువురు కోలాటాలు, భజనలు, సాంప్రదాయ నృత్యాలు చేస్తూ అలరించారు. ఆలయ ఛైర్మన్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta), మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తదితరులు రథయాత్రలో పాల్గొన్నారు.
Neela Kanteswara Temple | పోలీసుల భద్రత
నీలకంఠేశ్వరాలయంలో రథసప్తమి వేడులకు సంబంధించి పోలీసులు పట్టిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రహదారిని వన్‌వే చేసి రథం రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూశారు. భక్తులకు అసౌకర్యం కల్గకుండా చర్యలు తీసుకున్నారు.