Homeబిజినెస్​Stock Market | స్టాక్‌ మార్కెట్లకు రేట్‌ కట్‌ జోష్‌.. 25 వేల మార్క్‌కు నిఫ్టీ

Stock Market | స్టాక్‌ మార్కెట్లకు రేట్‌ కట్‌ జోష్‌.. 25 వేల మార్క్‌కు నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Market | ఆర్‌బీఐ(RBI) తీసుకున్న రేట్‌ కట్‌(Rate cut) నిర్ణయంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) శుక్రవారం పరుగులు తీస్తున్నాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్‌(Sensex) ఆర్‌బీఐ మీటింగ్‌ నేపథ్యంలో మొదట్లో ఒత్తిడికి గురయ్యింది. ఇంట్రాడేలో 302 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ(Nifty) సైతం ఫ్లాట్‌గా ప్రారంభమై 79 పాయింట్లు నష్టపోయింది. ఆర్‌బీఐ రేట్‌ కట్‌తోపాటు సీఆర్‌ఆర్‌(CRR) రేట్‌ కట్‌ కూడా ప్రకటించడంతో ఒక్కసారిగా బలంగా కోలుకుంది. ఇంట్రాడే కనిష్టాలనుంచి సెన్సెక్స్‌ వెయ్యి పాయింట్లకుపైగా పెరగ్గా.. నిఫ్టీ 3 వందలకుపైగా పాయింట్లు పెరిగింది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సెన్సెక్స్‌ 719 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 238 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి.

Stock Market | కాపిటల్ గూడ్స్​లో అమ్మకాల ఒత్తిడి

పీఎస్‌యూ బ్యాంక్స్‌, టెలికాం(Telecom), క్యాపిటల్‌ గూడ్స్‌ సెక్టార్స్‌ మినహా మిగతా అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి. బీఎస్‌ఈ క్యాపిటల్‌ గూడ్స్‌, టెలికాం ఇండెక్స్‌లు 0.26 శాతం చొప్పున నష్టపోగా.. పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.12 శాతం తగ్గాయి. రియాలిటీ షేర్లలో జోష్‌ కొనసాగుతోంది. రియాలిటీ ఇండెక్స్‌ 4.29 శాతం పెరిగింది. ఆటో ఇండెక్స్‌ 1.06 శాతం, పవర్‌, ఇన్‌ఫ్రా, ఎనర్జీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పీఎస్‌యూ ఇండెక్స్‌లు అర శాతానికిపైగా లాభంతో ఉన్నాయి. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.90 శాతం, మిడ్‌ క్యాప్‌ 0.45 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.38 శాతం లాభాలతో ఉన్నాయి.

Stock Market | Top gainers..

బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 28 స్టాక్స్‌ లాభాలతో, 2 స్టాక్స్‌ మాత్రమే నష్టాలతో కొనసాగుతున్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌(Bajaj finance) 4.18 శాతం పెరగ్గా.. యాక్సిస్‌ బ్యాంక్‌ 3.42 శాతం, మారుతి 2.82 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2.65 శాతం, ఎటర్నల్‌ 2.49 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 2.09 శాతం పెరిగాయి.

Stock Market | Top Losers..

సన్‌ఫార్మా(Sun Pharma) 0.69 శాతం, నెస్లే 0.30 శాతం నష్టాలతో ఉన్నాయి.

Must Read
Related News