అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kingdom Movie | టాలీవుడ్‌లో రష్మిక – విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) జంట గురించి హాట్ హాట్ డిస్కషన్ నడుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. కొన్నాళ్లుగా వీరిద్దరూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కలిసి పార్టీలు చేసుకోవడం, వెకేషన్స్‌కి వెళ్లడం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందా అంటే ఎలాంటి స్పందన లేదు. అయితే తాజాగా రష్మిక, విజయ్ దేవరకొండల మధ్య సోషల్ మీడియాలో జరిగిన డిస్కషన్ హాట్ టాపిక్ అయింది. ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘కింగ్‌డమ్’ ఒకటి. ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు జులై 31న గ్రాండ్‌గా విడుదల కానుంది.
Kingdom Movie | క్రేజీ ట్వీట్స్..
గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri) దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా, భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) కథానాయికగా పరిచయం అవుతోంది. సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా ట్రైలర్ శనివారం రాత్రి (జులై 26) విడుదలైంది. ట్రైలర్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అలాగే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రీమియర్ షోలు ఇప్పటికే హౌస్‌ఫుల్ అవుతున్నాయి. అయితే ట్రైలర్ విడుదల సందర్భంగా విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్‌కు రష్మిక మందన్న స్పందించిన విధానం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కింగ్‌డమ్ (Kingdom trailor) ట్రైలర్‌ను విజయ్ తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్‌లో షేర్ చేయగా, రష్మిక స్పందిస్తూ.. “ఈ నెల 31వ తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఆ రోజు విజయ్ దేవరకొండ ఫైర్ చూడాలని ఉంది. గౌతమ్ తిన్ననూరి, అనిరుధ్, విజయ్ దేవరకొండ.. ముగ్గురు జీనియస్‌లు కలిసి సృష్టించిన చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా” అని రాసుకొచ్చింది.
ఇక రష్మిక (Rashmika) ట్వీట్‌కి ప్రతిగా విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. “రస్సీలు అంటూ లవ్ సింబల్ జోడించి… ఎంజాయ్ ది కింగ్‌డమ్!” అని ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. అభిమానులు తెగ ఖుషీ అవుతూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరి లవ్ కన్ఫర్మ్ అయిపోయింది”, “స్క్రీన్ మీద కాకుండా ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా నెక్స్ట్ లెవల్, ఇప్పుడు కింగ్‌డమ్ థియేటర్లలో రష్మిక కూడా ఫస్ట్ షోకి వస్తే శుభం అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.