HomeUncategorizedRashmika Mandanna | విజ్జూ అంటూ ప్రేమగా పిలిచిన రష్మిక.. మరోసారి హాట్ టాపిక్‌గా ర‌ష్మిక‌-...

Rashmika Mandanna | విజ్జూ అంటూ ప్రేమగా పిలిచిన రష్మిక.. మరోసారి హాట్ టాపిక్‌గా ర‌ష్మిక‌- విజ‌య్ ప్రేమ వ్య‌వ‌హారం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rashmika Mandanna | విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక జంట గ‌త కొద్ది రోజులుగా హాట్ టాపిక్ అవుతున్నారు. వీరిద్ద‌రూ క్లోజ్‌గా మూవ్ అవుతున్న‌ట్టు క‌నిపిస్తున్నా ఇద్ద‌రి మ‌ధ్య ఏం లేన‌ట్టు ఉంటున్నారు. దాంతో వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న‌ బంధం ఫ్రెండ్​ షిపా లేకుంటే ల‌వ్వా అనేది క్లారిటీ రావ‌డం లేదు. విజయ్- రష్మిక జంట ఇటీవ‌ల ముంబయి విమానాశ్రయం(Mumbai Airport)లో క‌నిపించారు. ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ కెమెరాల‌కు చిక్కారు. ఈ దృశ్యాలు తక్కువ సమయంలోనే వైరల్‌ అవగా, అభిమానులు ఇప్పుడైన‌ కన్ఫర్మ్ చేస్తారా? అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపించారు. అయితే ఇవ‌న్నీ వారు లైట్ తీసుకున్నారు. ఇక ఇటీవల రష్మిక నటించిన ‘కుబేరా’ సినిమా ప్రమోషన్స్‌(‘Kubera’ movie promotions)లో భాగంగా, విజయ్ దేవరకొండ ట్విటర్‌ ద్వారా టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Rashmika Mandanna | క్లారిటీ ఇచ్చిన‌ట్టేనా..

ఆ ట్వీట్‌లో.. విజయ్‌ రష్మికకు తన మద్దతు తెలపడమే కాకుండా, దర్శకుడు శేఖర్ కమ్ముల(Director Sekhar Kammula)పై ఉన్న గౌరవాన్ని కూడా తెలియజేశారు. ఇక తాజాగా ర‌ష్మిక‌.. విజ‌య్‌ని విజ్జూ అని ఆప్యాయంగా పిల‌వ‌డంతో వీరి రిలేష‌న్‌పై అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డుతున్నాయి. వ‌రుస హిట్స్‌తో దూసుకుపోతున్న ర‌ష్మిక రీసెంట్‌గా త‌న తాజా చిత్రం మైసా(Maisa) ఫ‌స్ట్ లుక్ రివీల్ చేసింది. రష్మిక ఆ పోస్టర్‌లో మైండ్ బ్లాక్ చేసేలా క‌నిపించింది. ఇది చూసిన అభిమానులు సోషల్‌ మీడియాలో రష్మిక మందన్న(Rashmika Mandanna)కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పడంతో పాటు, పోస్ట్‌లో ఆమెను చూసి సర్‌ప్రైజ్‌ అయ్యాం అంటూ కామెంట్స్ చేశారు.

అయితే తనకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసిన రష్మిక మందన్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) చేసిన పోస్ట్‌కు స్పందిస్తూ… ‘విజ్జూ… ఈ సినిమాతో నువ్వు గర్వపడేలా నేను చేయబోతున్నాను’ అంటూ పోస్ట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశమైంది. ఈ కామెంట్‌తో రష్మిక, విజయ్‌ దేవరకొండల మధ్య ఉన్న రిలేష‌న్ రివీల్ అయింద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. స్నేహానికి మించిన బాండింగ్ ఉండడం వల్లే విజయ్ దేవరకొండను విజ్జూ అని రష్మిక పిలిచింద‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు. త్వ‌ర‌లో మీ రిలేషన్ గురించి క్లారిటీ ఇవ్వాల‌ని కూడా కోరుతున్నారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘కింగ్‌డమ్’ అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. అలాగే రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్నానే ఎంపికైందన్న ప్రచారం నడుస్తోంది. అయితే చిత్రబృందం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.