అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vijay – Rashmika | టాలీవుడ్ మోస్ట్ లవబుల్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. చాలా కాలంగా రిలేషన్లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న ఈ సెలబ్రిటీ కపుల్, ఇప్పటికే అక్టోబర్‌లో సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని సమాచారం. తాజాగా వీరి పెళ్లి డేట్, వెన్యూ కూడా ఫిక్స్ అయ్యాయంటూ సోషల్ మీడియా (Social Media)లో జోరుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న 2026 ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారు. ఈ వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఘనంగా జరగనుందని తెలుస్తోంది. అక్కడి ఓ హిస్టారిక్ ప్యాలెస్‌ను ఇప్పటికే బుక్ చేసినట్లు సమాచారం. డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding)గా ఈ పెళ్లిని ప్లాన్ చేస్తున్నారని, అయితే ఆర్భాటం లేకుండా చాలా ప్రైవేట్‌గా నిర్వహించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Vijay – Rashmika | పెళ్లి ఎప్పుడంటే..
ఇప్పటివరకు తమ ప్రేమ వ్యవహారాన్ని ఎక్కడా అధికారికంగా వెల్లడించని ఈ జంట, ఎంగేజ్మెంట్ (Engagement) కూడా ఎవరికీ తెలియకుండా చాలా సింపుల్‌గా చేసుకున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు పెళ్లి కూడా అదే తరహాలో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే జరగనుందని సమాచారం. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో ఇండస్ట్రీ మిత్రుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఇస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక అక్టోబర్ 3, 2025న (దసరా మరుసటి రోజు) హైదరాబాద్ (Hyderabad)లో విజయ్, రష్మిక సీక్రెట్‌గా ఉంగరాలు మార్చుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నుంచే ఫిబ్రవరిలో పెళ్లి ఉంటుందనే ప్రచారం మొదలైంది. ఈ మధ్యకాలంలో ఇద్దరూ వేళ్లకు ఉంగరాలతో కనిపించడం, కలిసి వెకేషన్లకు వెళ్లడం, ఎయిర్‌పోర్టుల్లో ఒకే సమయంలో దర్శనమివ్వడం వంటి అంశాలు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి.
విజయ్ – రష్మిక లవ్ స్టోరీ విషయానికి వస్తే, ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో ఈ జంట ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇటీవలి కాలంలో పలు ఈవెంట్లలోనూ ఇద్దరి మధ్య కనిపించిన కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ ఈవెంట్లో విజయ్ రష్మికపై చూపించిన కేరింగ్, ఆమె చేతిని ముద్దాడిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే “నాకు సంబంధం లేని బాధ నుంచి కూడా నా పార్ట్నర్ నన్ను కోలుకునేలా చేశాడు” అంటూ రష్మిక చేసిన వ్యాఖ్యలు కూడా ఈ రిలేషన్ వార్తలకు బలాన్ని ఇచ్చాయి. అంతేకాదు, న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్ (India Day Parade)లో వీరిద్దరూ జంటగా పాల్గొనడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది.