HomeUncategorizedRashmika Mandanna | డిఫ‌రెంట్ ల‌వ్ సింబ‌ల్స్ చూపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ర‌ష్మిక మందన‌

Rashmika Mandanna | డిఫ‌రెంట్ ల‌వ్ సింబ‌ల్స్ చూపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ర‌ష్మిక మందన‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rashmika Mandanna | ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతుంది ర‌ష్మిక మందన‌. ఈ అమ్మ‌డు సినిమాల సంగ‌తేమో కాని విజ‌య్ దేవ‌ర‌కొండ‌(Vijay Deverakonda)తో ఎఫైర్ న‌డుపుతుంద‌నే వార్తల‌తో హాట్ టాపిక్ అవుతుంది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం సినిమాలో తొలిసారి వీరిద్దరూ కలిసి నటించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో వీరి కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ జంటకు ప్రేక్షకులు జేజేలు పలకడంతో గీత గోవిందం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఇద్దరూ కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం అనేది రాలేదు. ఇక అప్ప‌టి నుంచి విజయ్ – రష్మికలు క్లోజ్ ఫ్రెండ్స్‌ అయిపోయారు.

Rashmika Mandanna | క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్..

ఆ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో వచ్చిన డియర్ కామ్రేడ్ (Dear Comrade) డిజాస్టర్‌గా నిలిచింది. అటు తర్వాత అర్జున్ రెడ్డితో ఇండస్ట్రీని షేక్ చేశాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయిన విజయ్.. యూత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. ర‌ష్మిక(Heroine Rasmika Mandanna) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతోంది. ఇందులో భాగంగా ఈ హీరోయిన్ నటించిన కుబేర చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో రష్మిక విజయ్ దేవరకొండ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఈవెంట్​లో సుమ మీకు ఎవరి దగ్గర నుంచి ఏమి కావాలి అంటూ.. ఒక్కొక్క సెలబ్రిటీ పేరు.. చెప్పుకు వచ్చింది. ముందుగా నాగార్జున అనగానే రష్మిక చార్మ్ అని చెప్పింది. ఆ తరువాత ధనుష్ అని అడగగానే.. ఆయన ఆల్ ఇన్ వన్ అంటూ.. దర్శకత్వం, సింగింగ్ అన్ని చేయగలరు అంటూ చెప్పుకొచ్చింది.

ఇక అల్లు అర్జున్ అనగానే.. స్వాగ్ అని చెప్పింది. ఇక చివరిగా విజయ్ దేవరకొండ (Vijay devarakonda)అని సుమ అడగగానే.. చుట్టూ ఉన్నవారు అంతా విజిల్స్ వెయ్యడం మొదలుపెట్టారు.. దాంతో రష్మిక కాసేపు సిగ్గుపడి.. ఫైనల్​గా.. అతనిలో మొత్తం నాకు కావాలి అంటూ సమాధానం ఇచ్చింది.. ఈ స‌మాధానంతో ఇద్ద‌రి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ నిజ‌మేన‌ని అంద‌రూ ముచ్చ‌టించుకుంటున్నారు. ఇక ఆ త‌ర్వాత సుమ డిఫ‌రెంట్ ల‌వ్ సింబ‌ల్స్(love symbols) చూపించ‌మ‌ని అడ‌గ్గా ర‌ష్మిక దాదాపు ఐదు ర‌కాలుగా ల‌వ్ సింబల్స్ చూపించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.