అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vijay – Rashmika | టాలీవుడ్ ప్రేమ పక్షులుగా గత కాలంగా వార్తల్లో నిలుస్తున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా(Vijay – Rashmika) ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్ అవుతున్నారు. వీరిద్దరి ప్రేమ సంబంధం, హాలిడే ట్రిప్స్, కలిసి కనిపించిన ఫొటోలు వైరల్ కావడంతో ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందనే ప్రచారం అయితే ఓ రేంజ్‌లో సాగింది.
కట్ చేస్తే ఇప్పుడు వీరి ఎంగేజ్‌మెంట్ గురించి వార్తలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. విజయ్ – రష్మిక ఎంగేజ్‌మెంట్(Engagement) సీక్రెట్‌గా జరిగింది అనే వార్తలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుండగా, ఇద్దరూ ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. అయితే సన్నిహితుల సమాచారం ప్రకారం, ఈ ఎంగేజ్‌మెంట్ తక్కువ మంది బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరిగినట్టు ప్రచారం జరుగుతోంది.
Vijay – Rashmika | రష్మిక నుంచి సినీ అప్‌డేట్!
అయితే ఈ ప్రేమ, ఎంగేజ్‌మెంట్ రూమర్స్ మధ్యలో రష్మిక తన సోషల్ మీడియా లో ఓ పోస్ట్ చేసి నెటిజన్ల దృష్టిని మరల్చింది. తన తాజా సినిమా ‘థామా’ (Thamma Movie) నుంచి విడుదలైన లేటెస్ట్ సాంగ్ “నువ్వు నా సొంతమా” గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. ఆయుష్మాన్ ఖురానా , రష్మిక ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ బాలీవుడ్ మూవీని ఆదిత్య సర్పోత్దార్ తెరకెక్కిస్తున్నాడు. అక్టోబర్ 21న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రంలోని తాజా మెలోడీ సాంగ్‌ను చాలా ప్రత్యేకంగా చిత్రీకరించారని రష్మిక పేర్కొంది. రష్మిక తెలిపిన వివరాల ప్రకారం, షూటింగ్ చివరి రోజు, దర్శక నిర్మాతలు సడెన్‌గా వచ్చిన ఆలోచనతో ఈ పాటను ప్లాన్ చేశారట. అద్భుతమైన లొకేషన్ చూసిన తర్వాత అక్కడ ఓ మెలోడీ సాంగ్ చేసే ఆలోచన పుట్టిందని, అందరికీ ఆ ఐడియా నచ్చడంతో వెంటనే 3–4 రోజులు రిహార్సిల్స్ చేసి, పాటను పూర్తిచేశారట.
పాట విజువల్స్ అద్భుతంగా వచ్చాయని, థియేటర్‌లో ఈ సాంగ్ ప్రేక్షకులని తప్పకుండా ఎమోషనల్‌కి గురి చేస్తుందని రష్మిక ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సాంగ్‌లో పని చేసిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. కాగా, విజయ్ – రష్మిక ఎంగేజ్‌మెంట్ వార్తలు ఎంత వరకు నిజమన్నది త్వరలోనే తేలనుండగా, రష్మిక ప్రస్తుతం తన కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. త్వరలో విడుదలవుతున్న ‘థామా’ సినిమాతో బాలీవుడ్‌లో మరో హిట్ కొట్టాలని ఆమె ఎదురు చూస్తోంది.