
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rashmika Mandanna | ఒకప్పుడు సినీ పరిశ్రమ(Film Industry)లో హీరోయిన్లు కొంచెం బొద్దుగా ఉంటేనే అందంగా భావించేవారు. కానీ కాలక్రమేణా ప్రేక్షకుల అభిరుచులు మారాయి. ఇప్పుడు జీరో సైజ్, బాడీ ఫిట్‌గా ఉన్న హీరోయిన్‌లకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది.
అందుకే టాలీవుడ్, బాలీవుడ్ నటీమణులు ఫిట్‌గా ఉండేందుకు విపరీతంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న తన ఫిట్నెస్ రహస్యాన్ని(Fitness Secret) బయటపెట్టింది. 29 ఏళ్ల వయసులో ఉన్న రష్మికను అభిమానులు ఇప్పటికీ 16 ఏళ్ల కుర్రదానిలా కనిపిస్తోందని కామెంట్ చేస్తున్నారు. మరి ఆమె ఇంత యంగ్‌గా, ఫిట్‌గా ఉండడానికి కారణమేంటో స్వయంగా చెప్పింది.
Rashmika Mandanna | ఇదే సీక్రెట్..
ఒక తాజా ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక లీటర్ నీళ్లు తాగుతాను. ఆపిల్ సైడర్ వెనిగర్ (Apple Cider Vinegar) తీసుకుంటాను. నేను పూర్తిగా వెజిటేరియన్‌గా మారిపోయాను, ఇక మాంసాహారం తినను. అన్నం కూడా ఎక్కువగా తినను. టమాటో, బంగాళ దుంపలతో అలర్జీ ఉండడం వల్ల వాటిని పూర్తిగా మానేశాను. అలాగే ప్రతిరోజు సాయంత్రం తప్పనిసరిగా వ్యాయామం చేస్తాను” అని చెప్పింది. ఆమె ఫిట్నెస్ సీక్రెట్ తెలిసిన తర్వాత అభిమానులు “మేము కూడా రష్మిక ఫాలో చేస్తాం” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఇక కెరీర్ విషయానికి వస్తే, రష్మిక (Rashmika Mandanna) వరుస బ్లాక్‌బస్టర్లతో దూసుకుపోతోంది. పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా, కుబేర వంటి భారీ ప్రాజెక్టుల్లో నటించి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తోంది. అంతేకాకుండా అల్లు అర్జున్ 22వ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. అదే కాకుండా థామా, కాంచన 4 హారర్ మూవీస్‌తో పాటు ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో పాటు ఫిట్నెస్‌ను కూడా కాపాడుకుంటూ రష్మిక ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తోంది.