ePaper
More
    HomeFeaturesRashmika | రెండు నెల‌ల క్రితం ఎయిర్‌టెల్‌కి పోర్ట్ చేయించుకున్న ర‌ష్మిక‌.. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా..

    Rashmika | రెండు నెల‌ల క్రితం ఎయిర్‌టెల్‌కి పోర్ట్ చేయించుకున్న ర‌ష్మిక‌.. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rashmika | ఛార్మింగ్ బ్యూటీ ర‌ష్మిక మందన్న Rashmika క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ఆమె నటించిన సినిమాల‌కి ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. కన్నడ kannada సినిమాల ద్వారా కెరియర్‌ మొదలు పెట్టి కన్నడ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె తెలుగు సినీ పరిశ్రమ tollywood వైపు అడుగులు వేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఈమె ఛలో మూవీ Chalo Movie తో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి విజయాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత కూడా ఈమె అనేక సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్థాయిలో ఓ వెలుగు వెలుగుతోంది.

    Rashmika | ఇది క‌దా ..

    స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, హిందీ bollywood పరిశ్రమల్లో వ‌రుస సినిమాలు చేస్తుంది. ఈమె నటించిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించడంతో ఈమెకు ఇండియా వ్యాప్తంగా ప్రస్తుతం సూపర్ సాలిడ్ క్రేజ్ ఉంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ NTR, ప్రశాంత్ నీల్ Prashant neel దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో ఓ కీలకమైన పాత్రలో రష్మిక కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల కథను ప్రశాంత్ ఈమెకు వినిపించగా ఈమెకు ఆ పాత్ర నచ్చడంతో వెంటనే ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.

    ప్రస్తుతం ఈ నటి వరుస పెట్టి హిందీ bollywood సినిమాలలో నటిస్తోంది. ఇప్పటికే ఈమె నటించిన చావా మూవీ Chavaa Movie అద్భుతమైన విజయాన్ని సాధించ‌డం మ‌నం చూశాం. ఇక దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్కదిద్దుకోవాల‌నే కాన్సెప్ట్ ర‌ష్మిక బాగా ఫాలో అవుతుంది. ఈమె ప‌లు కంపెనీల‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తుంది. రెండు నెల‌ల క్రితం ర‌ష్మిక త‌న నెంబ‌ర్‌ని ఎయిర్‌టెల్‌కి Airtel పోర్ట్ చేసుకోగా, ఇప్పుడు ఏకంగా కంపెనీకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా Brand Ambassador మారింది. ఇది విన్న అభిమానులు ర‌ష్మిక‌నా, మ‌జాకానా అని కామెంట్ చేస్తున్నారు.

    More like this

    Shobha Yatra | శోభాయాత్ర ప్రారంభం.. గట్టి బందోబస్తు.. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Shobha Yatra : కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం...

    Betting app case | బెట్టింగ్ యాప్​ వేధింపులకు మరో యువకుడు బలి

    అక్షరటుడే, కామారెడ్డి : Betting app case | ఆన్​లైన్​ బెట్టింగ్ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈజీగా డబ్బు...

    GPO | రెవెన్యూశాఖపై అవినీతి ముద్రను తొలగించే బాధ్యత జీపీవోలదే : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: GPO | అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను...