అక్షరటుడే, ఇందూరు: Medicover Hospital | నిజామాబాద్ నగరంలోని మెడికవర్ ఆస్పత్రిలో మూడేళ్ల చిన్నారికి వైద్యులు అరుదైన చికిత్స నిర్వహించారు.
ఈ చికిత్సకు సంబంధించిన వివరాలను సోమవారం (సెప్టెంబరు 8) డాక్టర్ సదానంద్ రెడ్డి వివరించారు. శిశువులు పుట్టిన వెంటనే సహజంగా మూసుకోవాల్సిన చిన్న రక్తనాళం మూసుకోకపోతే దానిని పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసస్ (PDA) (Patent ductus arteriosus) అంటారని వైద్యుడు తెలిపారు.
రక్తనాళం మూసుకోకపోవడంతో చిన్నారులు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుంటారన్నారు. గతంలో దీనికోసం ఓపెన్ హార్ట్ సర్జరీ(Open heart surgery) మాత్రమే ఉండేదని తెలిపారు.
ప్రస్తుతం డివైస్ క్లోజర్ పద్ధతితో శస్త్రచికిత్స అవసరం లేకుండానే సురక్షితంగా చికిత్స చేయొచ్చని ఆయన వివరించారు.
ప్రస్తుతం మూడేళ్ల చిన్నారికి శస్త్రచికిత్స అవసరం లేకుండానే కొన్ని ప్రొసీజర్స్ ద్వారా రంధ్రం మూసివేసి ప్రాణాలను కాపాడామని వైద్యడు వివరించారు.
Medicover Hospital | అధునాతన గుండె చికిత్సలు
డాక్టర్ సందీప్ రావు మాట్లాడుతూ నిజామాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రిలో అధునాతన గుండె చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తాము చేసిన సర్జరీ నిరూపిస్తోందన్నారు.
మెడికవర్ ఆస్పత్రిలో నలుగురు అనుభవజ్ఞులైన కార్డియాలజీ నిపుణులు గుండె Heart సంబంధిత అన్ని రకాల చికిత్సలను అందిస్తున్నారని ఆయన వివరించారు. ఈ అరుదైన చికిత్స ఫలితంగా చిన్నారి పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉందని చెప్పారు.