Homeజిల్లాలునిజామాబాద్​Secure Child Care Hospital | సెక్యూర్ చైల్డ్ కేర్ ఆస్పత్రిలో అరుదైన చికిత్స

Secure Child Care Hospital | సెక్యూర్ చైల్డ్ కేర్ ఆస్పత్రిలో అరుదైన చికిత్స

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Secure Child Care Hospital | నిజామాబాద్ నగరంలోని ఖలీల్​వాడిలో సెక్యూర్ చైల్డ్ కేర్ ఆస్పత్రిలో అరుదైన చికిత్స చేసినట్లు ఆస్పత్రి వైద్యుడు కె.శ్రీధర్​ పేర్కొన్నారు.

ఆస్పత్రిలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. తక్కువ బరువుతో పుట్టిన నవజాత శిశువు అనారోగ్యంతో ఉండగా.. మూడురోజుల పాటు వెంటిలేటర్​పై ఉంచి సీపీఏపీ (CPAP) సర్ఫాక్టెంట్​ థెరపీ చేశామని వివరించారు. రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్‌తో (Respiratory distress syndrome), అప్నియా ఆఫ్ ప్రీమెచ్యూరిటీతో (Apnea of ​​prematurity) తక్కువ బరువుతో పుట్టిన శిశువుకు విజయవంతంగా చికిత్స చేశామని వివరించారు.