అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Medicover Hospital | మెడికవర్ ఆస్పత్రిలో ఓ రోగికి అరుదైన వెన్నెముక శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం ఆస్పత్రిలో న్యూరో సర్జన్ శ్రీకృష్ణ (Neurosurgeon Srikrishna) వివరాలు వెల్లడించారు. చిన్నులు అనే వ్యక్తి కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతూ తమ ఆస్పత్రికి వచ్చారన్నారు.
ఆస్పత్రికి వచ్చిన ఆయనను వివిధ రకాల పరీక్షలు చేసిన అనంతరం అతడి శరీరంలో నరాలపై ఒత్తిడి (Spinal Compression) ఉందని గుర్తించి.. శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించామన్నారు. ఆధునిక సాంకేతిక పద్ధతులు, న్యూరో మానిటరింగ్ సదుపాయాలతో శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఆపరేషన్ జరిగిన మరుసటి రోజు పేషెంట్‌ను నడిపించామని.. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగుందని వివరించారు.
వెన్నెముక సమస్యలు వయస్సుతో పెరుగుతుంటాయని డాక్టర్ శ్రీకృష్ణ తెలిపారు. కానీ సకాలంలో గుర్తించి చికిత్స పొందితే పూర్తిగా కోలుకోవచ్చని చెప్పారు. ఆధునిక టెక్నాలజీ వల్ల ఇప్పుడు క్లిష్టమైన న్యూరో సర్జరీలు(Neurosurgery) కూడా సులభంగా చేయగలుగుతున్నామని ఆయన వివరించారు. సమావేశంలో వైద్యుడు యజ్ఞ, సెంటర్ హెడ్ శ్రీస్వామి, మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ శ్రీకృష్ణను వైద్యులు, సిబ్బంది అభినందించారు.
