HomeUncategorizedGoogle Maps | తొమ్మిదేళ్ల వ‌య‌స్సులో మిస్సింగ్‌.. గూగుల్ మ్యాప్ వ‌ల‌న 38 ఏళ్ల ఏజ్‌లో...

Google Maps | తొమ్మిదేళ్ల వ‌య‌స్సులో మిస్సింగ్‌.. గూగుల్ మ్యాప్ వ‌ల‌న 38 ఏళ్ల ఏజ్‌లో పేరెంట్స్ వ‌ద్ద‌కు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Google Maps | సాధార‌ణంగా మ‌నం గూగుల్ మ్యాప్(Google Map) అనేది ఒక ప్ర‌దేశం నుండి ఒక ప్ర‌దేశంకి వెళ్ల‌డానికి వాడుతుంటాం. ఖచ్చిత‌మైన ప్లేస్ క‌నుగొనే క్ర‌మంలో గూగుల్ మ్యాప్ చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే కొన్ని సార్లు గూగుల్ మ్యాప్ వ‌ల‌న కొంద‌రు ప్ర‌మాదంలో కూడా ప‌డ్డారు. న‌దులు, అడ‌వుల్లోకి తీసుకెళ్ల‌డంతో భ‌య‌బ్రాంతుల‌కి గురైన సంద‌ర్భాలు లేక‌పోలేదు. ఇప్పుడు ఇక్క‌డ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.తొమ్మిదేళ్ల వయసులో తప్పిపోయిన బాలుడు(Missing boy) గూగుల్ మ్యాప్స్ Google Maps సాయంతో 38 ఏళ్ల ఏజ్​లో తన పేరెంట్స్ ద‌గ్గ‌ర‌కి చేరుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. 29 ఏళ్ల సుదీర్ఘ వ్యవధి తర్వాత కన్నవారి చెంతకు చేరాడు. ఈ ఘటన హరియాణాలోని అంబాలాలో జరిగింది.

Google Maps | ఇంట్రెస్టింగ్..

అంబాలా కాంట్​లోని కబీర్ నగర్​కు చెందిన సంజయ్ (Sanjay) తొమ్మిదేళ్ల వయసులో తన ఇంటి నుంచి ఆలయానికి బయలుదేరాడు. ఆ తర్వాత ఆడుకుంటూ అంబాలా కాంట్ రైల్వే స్టేషన్​కు వెళ్లి అక్కడ సరదాగా రైలు ఎక్కి నిద్రలోకి జారుకున్నాడు. నిద్ర‌లేచి చూసే స‌రికి రైలు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రాకి వెళ్లింది. అయితే అప్పుడు సంజయ్‌కి ఇంటి అడ్రెస్ తెలియ‌క‌పోవ‌డంతో ఎటూ వెళ్ల‌లేని ప‌రిస్థితి. ఆ స‌మ‌యంలో ఆగ్రాలోని ఓ దాబా యజమాని ఇంద్రజిత్, అతని భార్య గీత తప్పిపోయిన బాలుడు సంజయ్​కు ఆశ్రయం కల్పించారు. అప్పటికి ఇంద్రజిత్​కు పిల్లలు లేకపోవడంతో వారితోనే కలిసి సంజయ్ నివసించేవాడు.

ఆ తర్వాత దాబా యజమానికి ముగ్గురు పిల్లలు పుట్టారు. ఇక 2002లో మేరఠ్​కు మకాం మార్చారు. అక్కడి నుంచి 2004లో రిషికేశ్​కు మారారు. అనంతరం 2009లో ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రాధికను సంజయ్ వివాహమాడాడు. వారికి ముగ్గురు పిల్లలు పుట్టారు.అయితే, ఒకరోజు సంజయ్​కు అంబాలాలోని తన ఇంటి దగ్గర ఒక పోలీస్ పోస్ట్, దాని ముందు ఒక దర్గా ఉందని గుర్తుకొచ్చింది. దాని కోసం గూగుల్​లో Google వెతకడం ప్రారంభించాడు. గూగుల్ మ్యాప్స్ ద్వారా తన స్వగ్రామంలోని తన ఇంటిని గుర్తించాడు. ఆ స‌మ‌యంలో వీణ అనే మహిళ ఎవరి కోసం వెతుకుతున్నావని సంజయ్​ను అడిగింది. అప్పుడు తన తండ్రి పేరు కరం పాల్ అని, తల్లి పేరు వీణ అని ఆమెకు సంజయ్ చెప్పాడు. చిన్న వయసులోనే ఇంటి నుంచి తప్పిపోయానని చెప్పాడు. అత‌ని మాట‌లు వారు న‌మ్మ‌లేదు. సంజయ్ మొబైల్ నంబర్ తీసుకొని పంపారు

ఇటీవలే సంజయ్​కు వీణ ఫోన్ చేసి అంబాలా రమ్మని కోరింది. అక్కడికి వచ్చిన తర్వాత వీణ, తన బాల్యం గురించి కొన్ని జ్ఞాపకాలను అడిగారు. అతను ప్రతిదీ సరిగ్గా చెప్పాడు. దీంతో 29 ఏళ్ల తర్వాత తప్పిపోయిన తమ కుమారుడే సంజయ్ అని నమ్మి సంతోషపడ్డారు. సంజయ్ కనిపించకుండా పోయిన తర్వాత, మహేశ్ నగర్ MAhesh nagar పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాం. కానీ అతని ఆచూకీ లభించలేదు. సంజయ్‌ ఇంటికి రావడం కలా నిజమా ఆర్థం కావడం లేదు అని సంజయ్ తల్లి వీణ చెప్పారు.మరోవైపు సంజయ్ సోదరి రజని సైతం సోదరుడి రాకపై సంతోషం వ్యక్తం చేసింది. సంజయ్ సుదీర్ఘ పోరాటం తర్వాత చివరకు తన కుటుంబాన్ని కలిశాడని అతడి భార్య రాధిక చెప్పింది.