అక్షరటుడే, వెబ్‌డెస్క్ : YSRCP | మెడికల్ కాలేజీల (medical colleges) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో వైసీపీ నాయకులు (YCP leaders) కోటీ సంతకాలు సేకరించారు. ఆ సంతకాల ప్రతులను గవర్నర్‌కు సమర్పించేందుకు సోమవారం భారీ ర్యాలీలు నిర్వహించారు.
కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ కాలేజీలను ప్రైవేట్‌పరం (privatizing private colleges) చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. ప్రభుత్వానికి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ర్యాలీలకు భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
YSRCP | పోస్టర్ల కలకలం..
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతులను విజయవాడకు (Vijayawada) తరలిస్తున్నారు. శివాలయం చెక్ పోస్టు నుంచి బంగ్లా సర్కిల్ వరకూ వైసీపీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో వైసీపీ కార్యాలయం వద్ద గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్లు ఒక్కొక్కడిని రప్పా, రప్పా అంటూ పోస్టర్లతో కార్యకర్తలు హంగామా చేశారు. గతంలో జగన్ (Former CM Jagan) సభలో రప్పా.. రప్పా పోస్టర్లు (Rappa Rappa Posters) పెట్టడంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కొంతమందిపై కేసులు కూడా నమోదు చేశారు.
YSRCP | రోజా ఆగ్రహం
సీఎం చంద్రబాబుపై (CM Chandrababu) మాజీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఢిల్లీలో చక్రం తిప్పా, హైదరాబాద్ నిర్మించాను అని చెప్పుకునే చంద్రబాబు కనీసం 10 మెడికల్ కాలేజీలు కూడా కట్టలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లాలో కోటి సంతకాల ప్రతులున్న బాక్సులను మాజీ మంత్రి పేర్ని నాని స్వయంగా వాహనంలోకి లోడ్ చేశారు. మచిలీపట్నం నుంచి వైసీపీ కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాల ప్రతులు తరలిస్తున్నారు.