HomeUncategorizedRapido driver | మ‌హిళా ప్రయాణికురాల‌పై చేయి చేసుకున్న ర్యాపిడో డ్రైవ‌ర్.. నిల‌దీసినందుకేనా?

Rapido driver | మ‌హిళా ప్రయాణికురాల‌పై చేయి చేసుకున్న ర్యాపిడో డ్రైవ‌ర్.. నిల‌దీసినందుకేనా?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rapido driver | కర్ణాటక రాజధాని బెంగళూరులో (Bangalore) ఓ మహిళా కస్టమర్‌ను.. ర్యాపిడో బైక్ డ్రైవర్ (Rapido bike driver) కొట్టడం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. జయనగర్‌ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌లో ర్యాపిడో డ్రైవ‌ర్ మ‌హిళ చెంప చెళ్లుమ‌నిపించాడు. చిన్న వివాదంగా మొదలైన ఆ ఘటన.. చిలికి చిలికి గాలి వానలా పెరిగి పెద్దదైంది. మొదట్లోనే వారిద్దరి గొడవను ఆపేందుకు అక్కడ ఉన్న వారు ఎంత ప్రయత్నించినా ఇద్ద‌రు తెగ వాదించుకున్నారు. ఈ క్రమంలోనే డబ్బులు చెల్లించకపోవడం, హెల్మెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ ర్యాపిడో బైక్ డ్రైవర్.. ఆ మహిళ చెంపపై కొట్టాడు.

Rapido driver | చెంప చెళ్లుమ‌నిపించాడు..

ర్యాపిడో డ్రైవ‌ర్ (Rapido driver) మ‌హిళ‌పై చేయి చేసుకోవడంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. అయితే ర్యాష్ డ్రైవింగ్ (rash driving) కారణంగా ఆమె బైక్‌ను మధ్యలోనే ఆపేసి గొడవకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు (Police) రంగంలోకి దిగి.. ఫిర్యాదు చేయాలని చెప్పినా ఆమె అందుకు నిరాకరించడం గమనార్హం.ఈ సంఘటన కర్ణాటకలోని (Karnataka) బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (social media) వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ఓ యువతి రాపిడో బుక్ చేసుకుంది. ఓ 15 నిమిషాల తర్వాత ర్యాపిడో బైకు ఆమె ఉండే చోటుకు వచ్చింది.

యువతి ఓటీపీ చెప్పి బైకు ఎక్కి కూర్చోగానే యువతి వెళ్లాల్సిన గమ్యస్థానం వెైపు న‌డుపుతూ వెళ్లాడు. కొన్ని కిలోమీటర్లు వెళ్లిన తర్వాత యువతి బైకు ఆపమంది. డ్రైవర్ తన ద్విచక్రవాహనాన్ని ఆపాడు. ‘నువ్వు చాలా ర్యాష్‌గా బైకు డ్రైవ్ చేస్తున్నావ్.. అసలు సిగ్నల్స్ కూడా పట్టించుకోకుండా వెళుతున్నావ్..’ అంటూ గొడవ పెట్టుకుంది. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో గొడవ పెద్దదైంది. మరోవైపు రాపిడో డ్రైవర్‌ కన్నడ మాట్లాతుండగా మహిళ ఇంగ్లీష్‌ (English) మాత్రమే మాట్లాడటంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలోనే బైక్ డ్రైవర్ ఎవ్వరూ ఊహించని పని చేశాడు. యువతి చెంపపై గట్టిగా లాగిపెట్టి కొట్టాడు. దీంతో యువతి రోడ్డుపై పడిపోయింది. సోషల్‌ మీడియాలో (Social Media) ఇది వైరల్ గా మారింది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.