అక్షరటుడే, బోధన్: Bodhan MLA | ప్రజలు సకాలంలో పన్నులు చెల్లిస్తేనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (Bodhan MLA Sudarshan Reddy) అన్నారు. బోధన్ మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన 15 చెత్త సేకరించే ఆటోలను ఆయన మంగళవారం ప్రారంభించారు.
Bodhan MLA | ప్రజలు పన్నులు చెల్లించాలి..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రతిఇంటికి చెత్త సేకరించే ప్రణాళికతో అధికారులు ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. ప్రజలు సైతం పన్నులు సకాలంలో చెల్లిస్తే అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని పేర్కొన్నారు. వందశాతం పన్నులు వసూలు చేయాలని మున్సిపల్ సిబ్బందిని (municipal staff) సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్, బోధన్ మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్ ఎల్లయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పాషా తదితరులు పాల్గొన్నారు.