అక్షరటుడే, హైదరాబాద్: Rape Murder | హైదరాబాద్ Hyderabad లో ఒకేరోజు ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపింది.
ఒకేరోజు రెండు దారుణ ఘటనలు వెలుగు చూడటంతో మహా నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ Cherlapalli railway station సమీపంలో గోనసంచిలో ఓ మహిళ మృతదేహం లభ్యం అయింది.
సంచి నుంచి దుర్వాసన రావడం, మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో ఉండడంతో రెండు రోజుల క్రితమే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బీహార్‌కు వెళ్లే రైలు కోసం నిన్న (సెప్టెంబరు 15) అనేక మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కు వచ్చారు. కాగా, వారు వెళ్లిన తరువాత సంచీలో మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులకు ఆటో డ్రైవర్ తెలిపాడు.
మృతి చెందిన మహిళ వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా, డాగ్ స్క్వాడ్ dog squad సాయంతో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Rape Murder | రాజేంద్రనగర్‌లో..
ఇక రాజేంద్రనగర్ Rajendranagar పోలీసు స్టేషన్ police station పరిధిలో మరో దారుణం వెలుగు చూసింది. కిస్మత్‌పురా బ్రిడ్జి కింద ఓ యువతి మృతదేహం లభ్యమైంది.
ఆ డెడ్‌బాడీ నగ్నంగా ఉండటంతో.. అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
25 నుంచి 30 ఏళ్ల వయసున్న ఈ యువతిని మూడు రోజుల క్రితమే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. క్లూస్ టీమ్ సాయంతో, సీసీటీవీ ఫుటేజీ CCTV footage ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.