అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | ఫేస్‌బుక్(Facebook)లో పరిచయమైన ఓ యువతిని అత్యాచారం చేసి వీడియోలు తీశాడో దుర్మార్గుడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్(Hyderabad) నగరంలో చోటు చేసుకుంది.
సోషల్ మీడియా(Social Media)లో పరిచయాలు అంతమంచివి కావని అధికారులు చెబుతూనే ఉన్నారు. కానీ కొందరు యువతులు మోసగాళ్ల మాటలు నమ్మి బలవుతున్నారు. ముక్కు, మొఖం తెలియని వారితో ఆన్లైన్లో స్నేహం చేసి చివరకు మోస పోతున్నారు. ఇలాగే ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతిని ఇంటికి లంచ్‌కు పిలిచి అత్యాచారం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్(Banjara Hills)లో నివసిస్తున్న 24 ఏళ్ల యువతికి 2023 ఫిబ్రవరిలో ఫేస్‌బుక్ ద్వారా మహేంద్రవర్ధన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అనంతరం ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు. 2023 ఆగస్టులో మహేంద్రవర్ధన్ సదరు యువతిని తన ఇంటికి భోజనానికి పిచిచాడు. ఇంటికొచ్చిన ఆమెను మాటల్లో పెట్టి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాకుండా యువతి ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు.
Hyderabad | డబ్బులు డిమాండ్..
యువతి వీడియోలు, ఫొటోలు తీసిన నిందితుడు డబ్బులు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు రూ.20 లక్షలు ఇచ్చింది. తాజాగా మళ్లీ నిందితుడు రూ.కోటి ఇవ్వాలని యువతిని బెదిరించడం మొదలు పెట్టాడు. తాను అంత ఇచ్చుకోలేనని ఆమె వేడుకున్నా.. ఫొటోలు, వీడియోలు నెట్లో పెడతానంటూ బెదిరించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు(Police) దర్యాప్తు చేస్తున్నారు.