Homeజిల్లాలుకామారెడ్డిKamareddy SP | అత్యాచార నిందితుడి అరెస్ట్: ఎస్పీ రాజేష్ చంద్ర

Kamareddy SP | అత్యాచార నిందితుడి అరెస్ట్: ఎస్పీ రాజేష్ చంద్ర

మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | మహిళపై కిరాతకంగా అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో (district police office) శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ మండలం (Palvancha mandal) ఫరీద్ పేట గ్రామానికి చెందిన ఓ మహిళ పత్తి చేను వద్ద పనులు చేసుకుంటుండగా గ్రామ శివారులో ఉన్న మణికంఠ రైస్ మిల్లులో పని చేసే వ్యక్తి వెనక నుంచి వచ్చి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం పొదల్లోకి లాక్కెళ్లి అరవకుండా నోరు నొక్కి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. విచారణ చేపట్టిన పోలీసులు.. రైస్ మిల్లులో పని చేస్తున్న 40 మంది వివరాలపై ఆరా తీశారు. ఈ 40 మందిలో కొంతమంది కనిపించలేదు.

కాగా.. విచారణలో అత్యాచారం చేసిన వ్యక్తి బీహార్​కు (Bihar) చెందిన రాహుల్ కుమార్​గా గుర్తించారు. అయితే అతని ఫ్యామిలీ పంజాబ్ (Punjab) షిఫ్ట్ అయినట్టు తెలుసుకున్నారు. అత్యాచారం అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి ఆచూకీ కోసం కామారెడ్డి రూరల్, ఎల్లారెడ్డి, సీసీఎస్ సీఐలు, మాచారెడ్డి, దేవునిపల్లి, గాంధారి ఎస్సైలతో ఏడు బృందాలను ఏర్పాటు చేసి ఈ బృందాలను బీహార్, పంజాబ్, మహారాష్ట్రకు పంపించారు. నిందితుడు రాహుల్ మహారాష్ట్రలోని గొండియా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు గురువారం దొరికాడు. అక్కడ మేజిస్ట్రేట్ ముందు అతడిని హాజరు పరిచి ఇక్కడకు తీసుకువచ్చారు.

Kamareddy SP | ముసుగు వేసుకుని తిరిగిన నిందితుడు

మహిళపై అత్యాచారం అనంతరం గ్రామస్థులో లేదా ఇతరులో వెంటనే పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నా చేయలేదని ఎస్పీ అన్నారు. ఫిర్యాదు ఆలస్యంగా రావడంతో నిందితుడు పారిపోయాడని తెలిపారు. సీసీ కెమెరాల (CCTV cameras) ద్వారా నిందితుడు రాహుల్ మహారాష్ట్రలో ఉన్నాడని తెలుసుకున్న అనంతరం అతడి కోసం పోలీసులు గాలించారన్నారు. ఈ క్రమంలో నిందితుడు రాహుల్ పోలీసులకు దొరకకుండా ముఖంపై శాలువా కప్పుకుని తిరుగుతున్నాడని వివరించారు. పేరు తప్ప ఏ వివరాలు లేని నిందితుడిని పట్టుకోవడం కష్టమైనా.. పోలీసులు అతడిని చాకచక్యంగా పట్టుకున్నారని వివరించారు.

Kamareddy SP | వలస కార్మికుల డేటా సేకరిస్తాం

మహిళపై అత్యాచారం ఘటన తర్వాత వలస కూలీల వివరాలపై రాష్ట్రస్థాయిలో చర్చ వచ్చిందని ఎస్పీ తెలిపారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వలస వచ్చి పని చేస్తున్న వారి పూర్తి వివరాలు సంబందిత కాంట్రాక్టర్ వద్ద ఉంచాలన్నారు. ఫరీద్ పేట రైస్ మిల్లులో (Faridpet Rice Mill) పనిచేసే రాహుల్ పేరు, ఊరు తప్ప ఇతర ఏ వివరాలు రైస్ మిల్లు యాజమాన్యం వద్ద లేవని వివరించారు. ప్రస్తుతం వారి డేటా సేకరించడం కోసం ఫార్మాట్ తయారు చేస్తున్నామని, తద్వారా కేసుల ఛేదనతో పాటు ఏదైనా అనుకోని ఘటన జరిగి కార్మికుడికి ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులకు సమాచార అందించే అవకాశం ఉంటుందన్నారు.

మహిళపై అత్యాచారానికి పాల్పడిన రాహుల్​ను శనివారం కోర్టులో హాజరు పరిస్తామని.. ఇంకా విచారణ కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. రాహుల్ పై గతంలో ఎలాంటి కేసులు లేవన్నారు. అతని నుంచి ఒక గొలుసు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, కామారెడ్డి రూరల్ సీఐ రామన్, మాచారెడ్డి ఎస్సై అనిల్, గాంధారి ఎస్సై ఆంజనేయులు, సీసీఎస్ సీఐ, తదితరులు పాల్గొన్నారు.