అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ranveer Singh Threat Controversy | బాలీవుడ్ సినీ పరిశ్రమ (Bollywood Film Industry)ను గత కొంతకాలంగా టార్గెట్ చేస్తూ వస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ హీరోలకు బెదిరింపులు పంపిన ఈ గ్యాంగ్, ఇప్పుడు స్టార్ హీరో రణవీర్ సింగ్ ను లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో క్లిప్‌లో రణవీర్ సింగ్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు వినిపిస్తోంది.
ఆ ఆడియోలో “రణవీర్… నీ ఏడు తరాలు గుర్తుంచుకునేలా నీకు బుద్ధి చెబుతాం. నీ దగ్గర పని చేస్తున్న మేనేజర్లు, స్టాఫ్ వివరాలన్నీ మా వద్ద ఉన్నాయి. వాళ్లు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు అన్న విషయాలు కూడా మాకు తెలుసు. నిన్ను నేరుగా ఏమీ చేయం… కానీ నీ వద్ద పనిచేసే ప్రతి ఒక్కరినీ చంపుతాం. అప్పుడే నీకు బుద్ధి వస్తుంది” అంటూ బెదిరించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ హెచ్చరికలు కేవలం రణవీర్కే కాకుండా మొత్తం బాలీవుడ్ చిత్ర పరిశ్రమకే వర్తిస్తాయని కూడా పేర్కొన్నట్లు సమాచారం.
Ranveer Singh Threat Controversy | ఆడియోలో ఏముంది..
ఈ బెదిరింపుల వెనుక గతంలో ఇచ్చిన ఒక కమిట్మెంట్ కారణమని ఆ ఆడియోలో ప్రస్తావించారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ కమిట్మెంట్ ఏమిటి అన్నది స్పష్టత రాలేదు. ఈ పరిణామం బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. పలువురు సినీ ప్రముఖులు భద్రతా అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ బెదిరింపు ఆడియోపై ముంబై పోలీస్ అధికారులు (Mumbai Police officers) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆడియో అసలుదనంపై ఫోరెన్సిక్ పరిశీలనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే రణవీర్ సింగ్‌కు అదనపు భద్రత కల్పించే అవకాశముందని కూడా సమాచారం.
మొత్తంగా ఈ ఘటన మరోసారి సినీ ప్రముఖుల భద్రతపై చర్చకు దారితీసింది. బాలీవుడ్లో భయం, ఉత్కంఠ వాతావరణం నెలకొనగా… దర్యాప్తు అనంతరం అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గతంలో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఆయన బంధువులని కూడా బెదిరించడం చూశాం. ఇలా పలువురు ప్రముఖులని టార్గెట్ చేస్తూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi Gang) బెదిరింపులకి దిగుతుండడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్‌గా మారింది.