Homeజిల్లాలునిజామాబాద్​Science Exhibition | జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైన రెంజర్ల ఉన్నత పాఠశాల ప్రాజెక్టు

Science Exhibition | జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైన రెంజర్ల ఉన్నత పాఠశాల ప్రాజెక్టు

జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైన రెంజర్ల ఉన్నత పాఠశాల ప్రాజెక్టు ఎంపికైందని ఆ పాఠశాల హెచ్​ఎం రవికుమార్​ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే ముప్కాల్: Science Exhibition | జాతీయస్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన-2025కు రెంజర్ల ఉన్నత పాఠశాల ప్రాజెక్టు (Rangers High School Project) ఎంపికైందని ఆ పాఠశాల హెచ్​ఎం జె.రవికుమార్​ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో ఆయన మాట్లాడుతూ.. సహజ పద్ధతిలో ధాన్యం చెడిపోకుండా చేసే ఈ ప్రాజెక్టును తయారు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

ఈ పద్ధతిలో ధాన్యం 6 నుంచి 8 నెలల వరకు సురక్షితంగా ఉంటుందని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. ఈ ప్రాజెక్టులో సహజ సిద్ధంగా లభ్యమయ్యే అల్లం, వేపాకు, ఆవు పేడ, బూడిద, లవంగాలు, బిర్యానీ ఆకు వాడడం జరిగిందని వివరించారు. గత జనవరి పుదుచ్చేరిలో జరిగిన దక్షిణ భారత స్థాయి సైన్స్ ఫెయిర్​లో (South India Level Science Fair) ఈ ప్రాజెక్ట్​ను ప్రదర్శించామన్నారు. తద్వారా జాతీయస్థాయికి ఎంపిక కావడం జరిగిందన్నారు.

ఈ సందర్భంలో వచ్చేనెల నవంబర్ 18 నుంచి 23 వరకు మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రం భోపాల్​లో తమ ప్రాజెక్ట్​ను ప్రదర్శించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు గ్రూప్ లీడర్​గా కె.అంకిత, గైడ్ టీచర్​గా సుద్ధపల్లి మల్లేష్ వ్యవహరించనున్నారన్నారు. ఈ ప్రాజెక్టు జాతీయస్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల హెచ్​ఎం జె.రవికుమార్, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు, వీడీసీ సభ్యులు తదితరులు అభినందించారు.