HomeUncategorizedRana Naidu Season 2 | ‘రానా నాయుడు’ సీజన్ 2 రివ్యూ .. నెట్...

Rana Naidu Season 2 | ‘రానా నాయుడు’ సీజన్ 2 రివ్యూ .. నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Rana Naidu Season 2 | రానా దగ్గుబాటి – వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రానా నాయుడు’ సిరీస్‌ (Rana Naidu series) మొదటి సీజన్‌ 2023 మార్చిలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. యాక్షన్-క్రైమ్ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్‌కు సుపర్న్ వర్మ, కరణ్ అన్షుమాన్ దర్శకులు. మొదటి సీజన్‌ 10 ఎపిసోడ్‌లు కాగా, సీజన్ 2 ఇప్పుడు 8 ఎపిసోడ్‌లతో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది.

  • నటీనటులు : రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, సుర్వీన్ చావ్లా, రాహుల్ వోహ్రా, కృతి ఖర్బందా, అర్జున్ రామ్ పాల్, అభిషేక్ బెనర్జీ, సుశాంత్ సింగ్ తదితరులు.
  • దర్శకత్వం : సుప్రాన్ ఎస్ శర్మ, అభయ్ చోప్రాల
  • నిర్మాణం : సుందర్ ఆరోన్, షో టైం నెట్వర్క్స్, లోకో మోటివ్ గ్లోబల్ మీడియా
  • సంగీత దర్శకుడు : జాన్ స్టీవర్ట్
  • సినిమాటోగ్రాఫర్ : జాన్ స్కిమిడ్త్, అంజు సంతాని
  • ఎడిటర్ : నైనాద్ ఖణోల్కర్

కథ‌:

రానా నాయుడు (రానా) (Rana Naidu) తన కుటుంబాన్ని రక్షించుకోవాలని, ఆర్థికంగా ఫ్యామిలీని సెట్ చేయాల‌ని నిర్ణయించుకుని, గతంలో చేస్తూ వచ్చిన డార్క్ పనులకు గుడ్‌బై చెబుతాడు. కానీ ఓబీ మహాజన్ (రాజేశ్ జైష్) (Rajesh Jaish) అతన్ని మళ్లీ తన దారిలోకి లాగడానికి ప్రయత్నిస్తాడు. అతని కారణంగా జైలు నుంచి బయటకి వచ్చిన గ్యాంగ్‌స్టర్ రౌఫ్ మీర్జా (అర్జున్ రాంపాల్), తన కజిన్‌ను చంపిన రానాపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు.

ఇదిలా ఉంటే, రానా నాయుడు భార్య నైనాను (సుర్వీన్ చావ్లా) పోలీస్ ఆఫీసర్ నవీన్ జోషీతో (police officer Naveen Joshi) చేరి బ్లాక్‌మెయిల్ చేయించేందుకు ప్రయత్నిస్తాడు. మరోవైపు, తేజు నాగా నాయుడుతో కలిసి డబ్బుకోసం బ్యాంక్‌ దొంగతనానికి పాల్పడి పోలీసులకు చిక్కుతాడు. విరాజ్ ఒబెరాయ్ కూతురు అలియా (కృతి కర్బందా)తో కలిసి క్రికెట్ కి సంబంధించిన బిజినెస్ చేయాలని రానా నాయుడు భావిస్తాడు. ఆమె తన పట్ల ఆకర్షితురాలైనా ఆయన పట్టించుకోడు. అలాంటి పరిస్థితుల్లోనే రేహాన్ ను .. అతని తండ్రిని రౌఫ్ హత్య చేస్తుంటే రానా నాయుడి కూతురు ‘నిత్య’ చూస్తుంది. దాంతో ఆమెను చంపాలని రౌఫ్ నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత రానాకి ఎదురైన సవాళ్లు ఏంటి? ఈ క్రమంలో తన భార్య నైనా నాయుడు (సుర్వీన్ చావ్లా) ఏం చేస్తుంది? తన తమ్ముడిని, మనుషుల్ని చంపేసిన రానాపై రౌఫ్ ఏం ప్లాన్ చేస్తాడు అనేది అనేది తెలియాలి అంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

Rana Naidu Season 2 | న‌టీన‌ట‌లు ప‌ర్‌ఫార్మెన్స్:

రానా (Rana Daggubati) ఈ సీజన్ కి మెయిన్ పిల్లర్ అని చెప్పవచ్చు. వన్ మ్యాన్ ఆర్మీగా ఈ సీజన్ ని తాను భుజాలపై నడిపించాడు. తన నటన, యాక్షన్ ఎమోషన్స్ తన డైనమిక్ ప్రెజెన్స్ ఈ సిరీస్ లో ఆకట్టుకుంటాయి. ఇక వెంకీ మామ తన రోల్ లోఆక‌ట్టుకున్నారు. గత సీజన్ తరహాలో మరీ ఎక్కువ యాక్షన్ లేదు కానీ తన నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ మాత్రం తన ఫ్యాన్స్ కి దక్కుతుంది. సుర్వీన్ చావ్లా చూడ్డానికి బాగుంది. హాట్ హాట్ గా కనిపిస్తూ.. నటనలోనూ ఆకట్టుకుంది. విలన్ పాత్రలో అర్జున్ రాంపాల్ (Arjun Rampal) ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. రజత్ కపూర్.. కృతి కర్బందా కీలక పాత్రల్లో రాణించారు. సుశాంత్ సింగ్.. అభిషేక్ బెనర్జీ.. ఆదిత్య మేనన్.. అంతా బాగానే చేశారు.

Rana Naidu Season 2 | టెక్నిక‌ల్ పర్‌ఫార్మెన్స్:

కథాకథనాలను భారీతనంతో కలిపి నడిపించిన తీరు బాగుంది. యాక్షన్ కి అక్కడక్కడా ఎమోషనల్ టచ్ ఇస్తూ వెళ్లిన విధానం కూడా ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. ఏ పాత్రను అనామకంగా వదిలేయకుండా వేసిన స్క్రీన్ ప్లే (Screen play).. ఆ పాత్రల మధ్య నడిపించిన డ్రామా బాగుంది. అయితే కొన్ని పాత్రలు బలహీనంగా అనిపించడం మాత్రం అసంతృప్తిని కలిగిస్తుంది. పాత్రలకు పవర్ జోడించి ఉంటే, కంటెంట్ ఇంకాస్త స్ట్రాంగ్ గా కనిపించేదనే భావన కలుగుతుంది. జాన్ స్కిమిద్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. జాన్ సీవర్ట్ (John Siewert’) నేపథ్య సంగీతం కూడా మెప్పిస్తుంది. నైనాద్ ఎడిటింగ్ ప‌రవాలేదు.

Rana Naidu Season 2 | విశ్లేషణ:

సీజన్ 2 స్ట్రీమింగ్‌లోకి రాగానే ప్రేక్షకుల మదిలో మెదిలే మొదటి ప్రశ్న..ఇది మొదటి సీజన్ కంటే మెరుగ్గా ఉంటుందా అని. మొదటి సీజన్‌కు తెలుగు ఆడియన్స్ నుంచి తీవ్ర విమర్శలే వచ్చాయి, ముఖ్యంగా బూతు, శృంగార సన్నివేశాల పరంగా వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌ని దృష్టిలో పెట్టుకొని ఈ సీజన్‌లో వాటిపై నియంత్రణ చూపిన తీరు మెచ్చుకోదగినది. మొదటి మూడు ఎపిసోడ్‌లు కొద్దిగా నెమ్మదిగా సాగినా, నాల్గో ఎపిసోడ్‌ నుంచి కథ వేగం పెరుగుతుంది. ముఖ్యంగా రానా, అర్జున్ రాంపాల్ పాత్రలకు ఎక్కువ స్క్రీన్ స్పేస్, డెప్త్ ఇవ్వడం వల్ల వీరి మధ్య సాగిన పోరాటం ఆకట్టుకుంటుంది. వెంకటేశ్ (Venkatesh) పాత్ర ఈ సారి ఎక్కువ ప్రాధాన్యత లేద‌నే చెప్పాలి. మిగతా పాత్రలు కూడా కొంత బలహీనంగా అనిపిస్తాయి.

కుటుంబాన్ని కాపాడాలన్న తపనలో సరైన మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉందన్న సందేశం బాగుంది. కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నా, అవి హద్దులు దాటకుండానే చూపించారు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ టచ్‌ను జోడించిన విధానం ప్రశంసనీయం. వెంకటేశ్ పాత్రతో కొద్దిగా కామెడీ టచ్ కూడా తీసుకొచ్చారు. రానా (Rana Daggubati) బాడీ లాంగ్వేజ్, అర్జున్ రాంపాల్ నటన (Arjun Rampal Acting) ముఖ్యంగా నిలిచాయి. కృతి కర్బందా పాత్ర మరింత విస్తరించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మొదటి సీజన్‌లో వదిలేసిన‌ పాయింట్లను ఈ సీజన్‌లో చక్కగా కొనసాగించారు. రానా, అర్జున్ రాంపాల్ పాత్రలు హైలైట్ అయిన‌ మిగతా పాత్రలకు కావలసిన బలం లేదన్నదే ఒక లోపం. యాక్షన్, ఎమోషన్ మిళితంగా సాగిన కథలో , తక్కువ శృంగారం, బూతు సన్నివేశాలు పెద్ద‌గా లేక‌పోవ‌డంతో సీజన్ 2 మెరుగైన అనుభూతిని ఇచ్చే ప్రయత్నం చేసింది.

రేటింగ్ : (3.5/5)