అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ramesh Chandra Sen Death | బంగ్లాదేశ్ (Bangladesh)లో మైనారిటీలైన హిందువుల పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. 18 నెలల క్రితం అక్కడ జరిగిన అల్లర్లలో ఓ మూక రమేశ్ చంద్ర సేన్‌పై దాడి చేసింది. ఆయనకు రక్షణగా నిలవాల్సిన అక్కడి పోలీసులు ఆయననే అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయనపై కేసులు పెడుతూ జైలులోనే ఉంచుతున్నారు.
అరెస్టుకు గల కారణాలను కూడా స్పష్టంగా వెల్లడించకుండా.. ఒక కేసు తర్వాత మరో కేసును ఆయనపై బనాయిస్తూ వచ్చారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జైలులో ఉంచడంతో వృద్ధాప్యం కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. తాను చాలా బలహీనంగా మారుతున్నానని, సరైన చికిత్స అవసరమని ఆయన కోర్టులో పలుమార్లు మొరపెట్టుకున్నా బెయిల్ మంజూరు కాకుండా అడుగడుగునా ఆటంకాలు సృష్టించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆయనను ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం కూడా అందంచలేదని తెలుస్తోంది. శనివారం రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆయన పోలీస్ కస్టడీ (Police Custody)లోనే మరణించారు.
Ramesh Chandra Sen Death | గొప్ప విద్యావేత్త..
అవామీ లీగ్ మాజీ నేత (Former Awami League Leader), మాజీ మంత్రి అయిన రమేశ్ చంద్ర సేన్‌కు గొప్ప విద్యావేత్తగా పేరుంది. ఆయన బంగ్లాదేశ్‌లో విద్యారంగం, రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలపాటు సేవలు అందించారు. అలాంటి నేత పోలీస్ కస్టడీలో మరణించడంపై బంగ్లా మైనారిటీలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం మరణం కాదని, వ్యవస్థీకృతమైన హత్యని బంగ్లాదేశ్‌లోని మైనారిటీ సంఘాలు (Minority Communities) ఆరోపిస్తున్నాయి.