Homeభక్తిRamappa Temple | యునెస్కో గుర్తింపు పొందిన రామ‌ప్ప‌.. ర‌మ‌ణీయ శిల్ప‌క‌ళా నిల‌యం ఈ ఆల‌యం

Ramappa Temple | యునెస్కో గుర్తింపు పొందిన రామ‌ప్ప‌.. ర‌మ‌ణీయ శిల్ప‌క‌ళా నిల‌యం ఈ ఆల‌యం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ramappa Temple | తెలుగు రాష్ట్రాల‌లో యునెస్కో నుండి గుర్తింపు పొందిన ఏకైక ఆలయం రామ‌ప్ప. ఈ రుద్రేశ్వర స్వామి ఆలయం (Rudreswara Swamy temple) తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది. ఇది హైదరాబాద్‌కి 200 కిలోమీటర్లు, వరంగల్‌కి (Warangal) 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రుద్రేశ్వరుడు అనే పేరుతో శివయ్య ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఈ గుడి శిల్ప సంపద విశిష్టమైంది. దీంతో ఈ ఆలయాన్ని తాజాగా ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది యునెస్కో. కాకతీయ గణపతి దేవ చక్రవర్తి (Kakatiya Ganapati Deva Chakravarthy) సేనాని రేచర్ల రుద్రయ్య 800 సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయం ఇది.

Ramappa Temple | శిలా నైపుణ్యం..

ఈ గుడిని చూసిన వారు ఎవ‌రైనా స‌రే నిర్మాణ కౌశలాన్నీ, శిల్ప కళా చాతుర్యాన్నీ మెచ్చుకుంటారు. ఈ గుడి శిల్పి పేరు రామప్ప. శిల్పి పేరుతో ఖ్యాతి గడించిన గుడి లేదా నిర్మాణం అరుదు. నేల నుంచి ఆరు అడుగులు ఎత్తున్న నక్షత్రాకార మండపంపై ఈ గుడి నిర్మించారు. నీటి మీద తేలియాడుతాయని చెప్పే ఇటుకలతో గర్భాలయం, విమానం నిర్మించారు. గుడిలో పలు ఉపాలయాలు, నంది విగ్రహం sub-temples and a Nandi idol) ఉన్నాయి. పక్కనే ఉన్న రామప్ప (Ramappa) చెరువు, అందమైన తోటలు దీనికి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. గుడిని ప్రధానంగా ఎర్ర ఇసుకరాయి (రెడిష్ శాండ్ స్టోన్)తో నిర్మించారు. బయటి భాగాల్లో నల్లరాయి వాడారు. పునాది లేకుండా నేరుగా ఇసుకపై ఈ గుడి నిర్మించారు. రాయి రంగు ఇప్పటికీ కోల్పోలేదు.

అనేక యుద్ధాలు, దాడులు, (Wars and attacks) 17వ శతాబ్దిలోని ఒక భూకంపాన్ని తట్టుకుని ఈ ఆలయం నిలిచింది. అయితే గుడి పరిధిలోని కొన్ని చిన్న నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ప్రధాన ద్వారం దెబ్బతింది. గర్భగుడి ముందుండే మండపంలో అద్భుత శిల్పకళ ఉంటుంది. పురాణ గాథలు, నాట్యగత్తెలు, సంగీత వాయిద్యకారులు, పౌరాణిక జంతువులు.. ఇలాంటివి ఆ శిల్పాలపై చెక్కారు. గుడి ఆవరణలో నంది మంటపంతోపాటు (Nandi Mandapam) మరో మూడు ఆలయాలున్నాయి. అవి కాటేశ్వరాలయం (Kateswara Temple), కామేశ్వరాలయం (Kameswara Temple), ఇంకొకటి బహుశా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం (Lakshmi Narasimha Swamy Temple). వీటిలో కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. ప్రధాన ఆలయం, రుద్రేశ్వరాలయంలో తప్ప మిగతావాటిలో పూజలు జరగడంలేదు. అయితే 2020, 21 సంవత్సరాలకు గాను.. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు.. యూనెస్కో (Unesco) పరిశీలనకు ఎంపికవగా.. భారత్‌ నుంచి 2020 సంవత్సరానికి రామప్పకు ప్రపంచస్థాయి ఖ్యాతి లభించింది.

Must Read
Related News