అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Chief secretary | తెలంగాణ ప్రభుత్వ కొత్త ఛీఫ్ సెక్రెటరీగా (Telanagana new CS) సీనియర్ ఐఏఎస్ అధికారి కె.రామకృష్ణరావు (Ramakrishana rao) నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం ఉన్న శాంతి కుమారి(Cs Shanti kumari) ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నూతన సీఎస్ ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి(Cm revanth reddy) కొద్దిరోజులుగా కసరత్తు జరిపారు. జపాన్ పర్యటన ముగించి తిరిగిన రాష్ట్రానికి వచ్చిన అనంతరం ఆయన సీఎస్ ఎంపిక కోసం పలువురి పేర్లను పరిశీలించారు. ఎట్టకేలకు 1991 బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావు నూతన సీఎస్(New CS telangana)గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఈయనకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పూర్తి పట్టుంది. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక వనరులను సమకూర్చే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో రామకృష్ణారావును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.