అక్షరటుడే, హైదరాబాద్: Ramagundam Airport | తెలంగాణ Telangana రాష్ట్రంలో ప్రాంతీయ విమాన సర్వీసుల అనుసంధానం కోసం సర్కారు చర్యలు తీసుకుంటోంది. పెద్దపల్లి జిల్లా Peddapalli district అంతర్గాం Antargam (రామగుండం) వద్ద మరో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి చర్యలు చేపడుతోంది.
ఇక్కడ ప్రతిపాదిత విమానాశ్రయం నిర్మాణం సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కు రూ.40.53 లక్షల నిధులు మంజూరు చేసింది.
రాష్ట్రంలో ఇప్పటికే ఆదిలాబాద్తోపాటు వరంగల్‌లో మమ్నూరు Mamnur విమానాశ్రయాల నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో పర్యాటక, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి మరింత ఊతం పడనుంది.
Ramagundam Airport | ఆరు ప్రాంతీయ విమానాశ్రయాలు..
రాష్ట్రంలో 6 ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పని నిమిత్తం విమానాశ్రయాల అథారిటీ ఆఫ్ ఇండియా (Airports Authority of India – AAI)ని కన్సల్టెన్సీ సేవల కోసం నియమించింది.
అంతర్గాం వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం 456 ఎకరాల భూమిని గుర్తించారు. ఇందుకు సంబంధిత డాక్యుమెంట్లను ఆ జిల్లా కలెక్టర్ ఇప్పటికే సర్కారుకు సమర్పించారు.
టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (Techno Economic Feasibility Report – TEFR) రూపొందించేందుకు రూ. 40.53 లక్షలు అవసరం అని ప్రతిపాదించారు. ఈమేరకు ప్రభుత్వం పాలనాపరమైన అనుమతి మంజూరు చేసింది.