7
అక్షరటుడే, వెబ్డెస్క్: Ramadan | ముస్లింల పవిత్రమైన రంజాన్ నెల ప్రారంభమైంది. భారత్ Bharat లో బుధవారం నెలవంక దర్శనం ఇవ్వడంతో రంజాన్ మాసం ప్రారంభమైనట్లు ముస్లిం మత పెద్దలు ప్రకటించారు. రేపటి (గురువారం, ఫిబ్రవరి19) ఉపవాసం దీక్షలు ప్రారంభమవుతాయి. ఇక ప్రత్యేక నమాజు తరావీ ప్రార్థనలు నేటి రాత్రి నుంచే ప్రారంభించారు. కాగా, సౌదీ అరేబియా Saudi Arabia లో మంగళవారం రాత్రి నెలవంక దర్శనం ఇవ్వడం గమనార్హం.
Ramadan | 31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో..
రంజాన్ మాసం దాదాపు 31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతోంది. గతంలో 1995 ఫిబ్రవరి 1వ తేదీన రంజాన్ మాసం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పుడే మళ్లీ ఫిబ్రవరిలో రంజాన్ మాసం ప్రారంభం కావడం గమనార్హం.