12
అక్షరటుడే, వెబ్డెస్క్: Ramadan | ముస్లింలకు అతి ముఖ్యమైన మాసం రేపటి (బుధవారం, ఫిబ్రవరి 18) నుంచే ప్రారంభం కానుంది. ఈ మేరకు సౌదీ అరేబియాలో నెలవంక దర్శనం ఇచ్చినట్లు మత పెద్దలు ప్రకటించారు. అంటే రేపటి నుంచి రంజాన్ సందడి మొదలుకాబోతోంది.
Ramadan | 31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో..
రంజాన్ మాసం దాదాపు 31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతోంది. గతంలో 1995 ఫిబ్రవరి 1వ తేదీన రంజాన్ మాసం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పుడే మళ్లీ ఫిబ్రవరిలో రంజాన్ మాసం ప్రారంభం కావడం గమనార్హం.