HomeసినిమాAndhra King Taluka | ఆంధ్రా కింగ్ తాలూకా టీజర్ రిలీజ్.. మాస్ గెట‌ప్‌లో మెస్మ‌రైజ్...

Andhra King Taluka | ఆంధ్రా కింగ్ తాలూకా టీజర్ రిలీజ్.. మాస్ గెట‌ప్‌లో మెస్మ‌రైజ్ చేసిన రామ్

Andhra King Taluka | రామ్​ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘ఆంధ్రా కింగ్​ తాలూకా’ సినిమా టీజర్​ ఆదివారం విడుదలైంది. ఈ చిత్రం నవంబర్​ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Andhra King Taluka | హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా మాస్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కు సంబంధించిన టీజ‌ర్ తాజాగా విడుద‌లై సినిమాపై అంచ‌నాలు పెంచింది. ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అనే ట్యాగ్‌ లైన్‌ను ఆధారంగా చేసుకుని, ఈ సినిమాకు ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే పేరు పెట్టినట్టు అనిపిస్తోంది. ఇందులో రామ్ ఒక మాస్ ఫాలోయింగ్ కలిగిన స్టార్‌కి డైహార్డ్ ఫ్యాన్‌గా కనిపించనున్నాడు.

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా మాస్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నుండి టీజర్‌ విడుదలైంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న దర్శకుడు పి. మహేష్ బాబు ఈ సినిమాతో మాస్ మసాలా జానర్‌లోకి అడుగుపెడుతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు. టీజర్‌లో రామ్ పోతినేని గెట‌ప్‌, గలగల పలికే డైలాగ్స్, మాస్ బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను అలరించాయి.

Andhra King Taluka | ఉపేంద్ర ఫ్యాన్‌గా రామ్!

ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర (Upendra) ‘ఆంధ్రా కింగ్’గా కనిపించనున్న పాత్రకు రామ్ పోతినేని వీరాభిమానిగా కనిపించనున్నాడు. టీజర్‌లో ఈ ఫ్యాన్-స్టార్ రిలేషన్ ఓ మేజర్ హైలైట్‌గా నిలిచింది. టీజర్‌లో (Teaser) రామ్ ఫుల్ ఎనర్జీతో క‌నిపించి సంద‌డి చేశాడు. వివేక్-మెర్విన్ మ్యూజిక్ కూడా బ్యాక్‌గ్రౌండ్‌కి కొత్త ఉత్సాహాన్ని జోడించింది. రామ్ ఫ్యాన్స్‌కి ఇది పక్కా పండుగే అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా రామ్ సరసన కనిపించనుండగా, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ వంటి అభినయ తారాగణం సినిమాను మరో మెట్టు ఎక్కించనున్నారు.

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రం నవంబర్ 28, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్‌తో భారీ హైప్ క్రియేట్ చేసిన చిత్రబృందం త్వరలోనే ట్రైలర్‌తో (Trailer) మరింత ఆసక్తిని పెంచనుంది. కొన్నాళ్లుగా రామ్‌కి స‌క్సెస్ అనేది లేదు. ఎంత క‌ష్ట‌ప‌డి సినిమా చేసిన అది రామ్‌తో పాటు ఆయ‌న అభిమానుల‌ను నిరుత్సాహ‌ప‌రుస్తూనే ఉంది. ఈ సినిమాతో అయిన రామ్‌కి మంచి హిట్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.