అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ram Charan Upasana Twins | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతుల ఇంట మరోసారి సంతోషాల సందడి నెలకొంది. ఇటీవల ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. జనవరి 31న ఒక బాబు, ఒక పాప పుట్టడంతో కొణిదెల కుటుంబంలో ఆనందం రెట్టింపైంది.
మెగా అభిమానులు సైతం వారసుడు వచ్చాడంటూ సోషల్ మీడియా (Social Media)లో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాసన తాజాగా తన మాతృత్వ అనుభూతులను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ పంచుకున్నారు.
Ram Charan Upasana Twins | ఎమోషనల్ వీడియో..
ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ ఖాతా (Instagram Account)లో షేర్ చేసిన వీడియోలో సీమంతం వేడుకల నుంచి డెలివరీ వరకూ జరిగిన ప్రత్యేక క్షణాలను చూపించారు. అపోలో ఆస్పత్రి వైద్య బృందం చేసిన ఏర్పాట్లు, డెలివరీకి ముందు ఎదురైన టెన్షన్, తీసుకున్న జాగ్రత్తలు, కవలలు పుట్టిన తర్వాత చిరంజీవి (Megastar Chiranjeevi) వ్యక్తం చేసిన ఆనందం, అభిమానుల సంబరాలు ఈ మొత్తం ప్రయాణాన్ని ఆ వీడియోలో అందంగా చూపించారు. “ఈ వీడియోను ప్రతిసారి చూస్తే నా హృదయం ఆనందంతో నిండిపోతుంది. మా కుటుంబంపై చూపించిన ప్రేమ, ఆశీస్సులకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అంటూ ఉపాసన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అపోలో హాస్పిటల్ డాక్టర్స్, రామ్ చరణ్ అభిమానులు, శ్రేయోభిలాషుల మద్దతు మరువలేనిదని ఆమె భావోద్వేగంగా తెలిపారు. తమ పిల్లల భద్రత, గౌరవం కాపాడుతారని విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు.
రామ్ చరణ్ – ఉపాసనల ప్రేమ వివాహం 2012లో జరిగింది. వారి దాంపత్యానికి గుర్తుగా ముందుగా క్లిన్ కారా పుట్టగా, ఇప్పుడు కవలల రాకతో కుటుంబ ఆనందం మరింత పెరిగింది. చిరంజీవి – సురేఖ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నట్లే, రామ్ చరణ్ (Ram Charan) కుటుంబంలోనూ ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉండటం విశేషంగా చెప్పుకుంటున్నారు అభిమానులు. మరోవైపు రామ్ చరణ్ ‘RRR’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. గ్రామీణ క్రీడా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కుటుంబ సంతోషం, కెరీర్ విజయాలు ఇద్దరి జీవితాల్లోనూ ఇప్పుడు స్వర్ణ యుగమే నడుస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు