అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ram Charan – Upasana | మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్త బయటకు రావడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రీసెంట్‌గా ఉపాసనకు ఘనంగా సీమంతం వేడుక నిర్వహించారు.
మెగా కుటుంబ సభ్యులు, కామినేని ఫ్యామిలీ పెద్దలు ఈ వేడుకకు హాజరై, రెండోసారి తల్లి అవుతున్న ఉపాసనకు ఆశీర్వాదాలు అందించారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రామ్ చరణ్-ఉపాసన (Ram Charan – Upasana) దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Ram Charan – Upasana | కవలల పిల్లలా..!
ఇక్కడ మరింత ఆసక్తి పెంచిన విషయం ఏమిటంటే, ఉపాసన తల్లి శోభన కామినేని (Shobhana Kamineni) తన సోషల్ మీడియాలో సీమంతం వేడుకకు సంబంధించిన వీడియో షేర్ చేస్తూ.. దీపావళి మాకు ఒక సంతోషకరమైన డబుల్ ధమాకా ఇచ్చింది! అనిల్, నేను వచ్చే ఏడాది ఉపాసన-రామ్ చరణ్ కవలలను (Twins) స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సంవత్సరం సంతోషంగా, ప్రకాశవంతంగా మారింది అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మెగా అభిమానులు, నెటిజన్లు దీనిని చూసి రామ్ చరణ్-ఉపాసన దంపతులకు కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక దీపావళి రోజు జరిగిన సీమంతం వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. హీరో వెంకటేష్ తన సతీమణితో కలిసి హాజరయ్యారు. అక్కినేని ఫ్యామిలీ కూడా హాజరై సందడి చేశారు.
ఇక మెగా ఫ్యామిలీ నుండి నాగబాబు, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, వైష్ణవ్ తేజ్, పవన్ కల్యాణ్ సతీమణి అన్నాలెజీనోవా (Anna Lezhinova) వంటి ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త విఘ్నేశ్ శివన్, పిల్లలతో కలిసిన ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నారు. ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్ర శర్మ ప్రధాన పాత్రల్లో ఉంటారు. ఆస్కార్ విజేత ఏఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చాలా భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ఈ సినిమా రామ్ చరణ్ పుట్టినరోజు, 2026 మార్చి 27న రిలీజ్ కానుంది.
