HomeUncategorizedNTR-Ram Charan | ఎన్టీఆర్‌- రామ్ చ‌ర‌ణ్ బాండింగ్ చూసి మురిసిపోయిన లండ‌న్ ప్ర‌జ‌లు

NTR-Ram Charan | ఎన్టీఆర్‌- రామ్ చ‌ర‌ణ్ బాండింగ్ చూసి మురిసిపోయిన లండ‌న్ ప్ర‌జ‌లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: NTR-Ram Charan | టాలీవుడ్ సినిమాల స్థాయి రోజురోజుకి పెరుగుతూ పోతోంది. బాహుబ‌లి Baahubaliచిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతి ఎల్ల‌లు దాటింది. ఇక ఆర్ఆర్ఆర్(RRR) చిత్రంతో మ‌రింత పెరిగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం ఎన్టీఆర్(NTR), రామ్ చ‌ర‌ణ్(Ram Charan) ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కించారు. ఈ మూవీ ఎన్నో రికార్డులు సాధించడంతో పాటు అరుదైన గౌర‌వం కూడా ద‌క్కించుకుంది. ఆస్కార్(Oscars), గోల్డెన్ గ్లోబ్(Golden Globes) వంటి వేదికలపై ఆర్ఆర్ఆర్ సత్తా చాటింది. ఇక తాజాగా లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్ బర్ట్ హాల్‌లో ఆర్ఆర్ఆర్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ జ‌ర‌గ‌గా.. ఈ ఈవెంట్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి, కీర‌వాణి సంద‌డి చేశారు. రామ్ చరణ్ నాలుగు రోజుల ముందే తన మైనపు విగ్రహావిష్కరణ(Wax statue) కోసం లండన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.

NTR-Ram Charan | బాండింగ్ అదుర్స్..

లండన్(London)లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్​లో ఆర్ఆర్ఆర్ (RRR) చిత్ర లైవ్ కాన్సర్ట్ ఘనంగా నిర్వహించారు. దీనికోసం రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి ఒకే వేదికపై క‌నిపించి సందడి చేశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. రాంచరణ్, ఎన్టీఆర్ రాయల్ ఆల్బర్ట్ హాల్(Royal Albert Hall)లోకి స్టైలిష్​గా ఎంట్రీ ఇచ్చారు. ఒకే వేదికపై RRR త్రయం కనిపించడంతో ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. ఆర్ఆర్ఆర్ టైంలో ఎన్టీఆర్- రామ్ చ‌ర‌ణ్ బాండింగ్ చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. చాలా రోజుల త‌ర్వాత ఎన్టీఆర్-రామ్ చ‌ర‌ణ్ క‌లిసి క‌నిపించ‌డంతో ఫ్యాన్స్ కేరింత‌లు కొట్టారు.

ఇక రాయల్ ఆల్బర్ట్ హాల్ వేదికపై రాంచరణ్ Ram Charan , జూనియర్ ఎన్టీఆర్​కు స్వీట్ సర్​ప్రైజ్​ (Sweet Surprise) ఇచ్చారు. త్వరలో మే 20న ఎన్టీఆర్ తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోబోతున్న నేప‌థ్యంలో వేదికపై జూనియర్ ఎన్టీఆర్​కు అడ్వాన్స్ బర్త్​డే విషెస్ తెలిపారు రామ్ చ‌ర‌ణ్‌. ఇక వీళ్లిద్దరి బాండింగ్ ఫ్యాన్స్​ను ఆకట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా రాంచరణ్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని షేర్ చేశారు. రామ్​చరణ్ భోజనంతో పాటు తన డైట్​లో వెన్నపూస కూడా తింటారని తెలిపారు. ఏది ఏమైనా ఈ ఇద్ద‌రు హీరోలు ఇంత అన్యోన్యంగా ఉండ‌డం చూసి ఫ్యాన్స్ మైమ‌రిచిపోతున్నారు. మ‌హేష్ బాబు కూడా ఈవెంట్‌కి వ‌స్తార‌ని అన్నారు. కానీ క‌నిపించ‌లేదు.

Must Read
Related News