Homeబిజినెస్​PRE MARKET ANALYSIS | గ్లోబల్‌ మార్కెట్లలో ర్యాలీ.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

PRE MARKET ANALYSIS | గ్లోబల్‌ మార్కెట్లలో ర్యాలీ.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. మంగళవారం అమెరికా, యూరోప్‌ మార్కెట్లు లాభాలతో ముగియగా.. బుధవారం ఉదయం సింగపూర్‌ స్టాక్‌ మార్కెట్‌ మినహా మిగతా ఆసియా మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి.

PRE MARKET ANALYSIS : యూఎస్‌ మార్కెట్లు..

టెక్‌ స్టాక్స్‌(Tech stocks) ర్యాలీ తీయడంతో అమెరికాకు చెందిన నాస్‌డాక్‌(Nasdaq) 0.81 శాతం లాభంతో ముగిసింది. ఎస్‌అండ్‌పీ 0.58 శాతం పెరిగింది. బుధవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ సైతం స్వల్ప లాభాలతో కొనసాగుతోంది.

PRE MARKET ANALYSIS : యూరోప్‌ మార్కెట్లు..

డీఏఎక్స్‌(DAX) 0.67 శాతం, సీఏసీ 0.34 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.15 శాతం లాభపడ్డాయి.

PRE MARKET ANALYSIS : పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మంగళవారం లాభాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కోస్పీ(Kospi) 2.40 శాతం లాభంతో ఉండగా.. తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛ్‌ంజ్‌ 2.10 శాతం, నిక్కీ 1.03 శాతం, హంగ్‌సెంగ్‌ 0.48 శాతం, షాంఘై 0.29 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. స్ట్రెయిట్‌ టైమ్స్‌ మాత్రం 0.30 శాతం నష్టంతో ఉంది. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.23 శాతం లాభంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

PRE MARKET ANALYSIS : గమనించాల్సిన అంశాలు..

  • ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు వరుసగా మూడో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ నెట్‌ సెల్లర్లుగా కొనసాగారు. ఎఫ్‌ఐఐ(FII)లు నికరంగా రూ. 2,853 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా డీఐఐ(DII)లు నికరంగా రూ. 5,907 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.
  • క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర బ్యారెల్‌కు 0.30 శాతం తగ్గి 63.22 డాలర్లకు తగ్గింది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసలు తగ్గి 85.58 కి చేరింది.
  • యూఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌ 0.02 శాతం తగ్గి 99.21 కి, యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 0.40 శాతం తగ్గి 4.45 వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.82 నుంచి 0.65 కు తగ్గింది. విక్స్‌(VIX) సైతం 3.51 శాతం తగ్గి 16.56 వద్ద ఉంది. పీసీఆర్‌తోపాటు విక్స్‌ తగ్గడం బుల్స్‌కు అనుకూలం.
  • అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో యూఎస్‌ ట్రేడ్‌ డీల్స్‌(Trade deals) ఇంకా కొలిక్కి రాలేదు.
  • రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జియో పొలిటికల్‌ టెన్షన్స్‌ ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదు.
  • స్టీల్‌, అల్యూమినియంలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన డబుల్‌ టారిఫ్స్‌(Tariffs) బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఇది మన మెటల్‌ స్టాక్స్‌పై స్వల్ప ఒత్తిడిని కలిగించొచ్చు.
  • గత ట్రేడింగ్‌ సెషన్‌లో వాల్‌ స్ట్రీట్‌(Wall street)లో ప్రధానంగా టెక్‌ స్టాక్స్‌ ర్యాలీ తీశాయి. దీంతో ఆసియా మార్కెట్లు సైతం లాభాలతో కొనసాగుతున్నాయి.
Must Read
Related News