అక్షరటుడే, కామారెడ్డి: kamareddy collector | మాదక ద్రవ్యాల నివారణ కోసం గురువారం నిర్వహించనున్న ర్యాలీ పోస్టర్ను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గురువారం ఉదయం 9:30 గంటలకు జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చి (CSI Church) నుంచి కళాభారతి వరకు ర్యాలీ నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ప్రమీల, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
