అక్షరటుడే, బోధన్ : Milad Un Nabi | పట్టణంలో మిలాద్ ఉన్ నబీ(Milad Un Nabi) సందర్భంగా సోమవారం భారీ ర్యాలీ తీశారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా బోధన్ రజాయా ముస్తఫా కమిటీ(Razaya Mustafa Committee) ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొనసాగించారు. మూడు రోజుల క్రితమే పండగ సందర్భంగా ర్యాలీ నిర్వహించాల్సి ఉండగా.. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ర్యాలీని సోమవారం నిర్వహించారు.
ఈ ర్యాలీ పట్టణంలోని రెంజల్(Renjal) బేస్‌లో ఉన్న సయ్యద్ షా జలాల్ బుఖారి దర్గా నుండి ప్రారంభమై పట్టణంలోని ప్రధాన వీధులగుండా అంబేడ్కర్ చౌరస్తాకు చేరుకుంది. అంబేడ్కర్ చౌరాస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మత పెద్దలు మహమ్మద్ ప్రవక్త గురించి, ఆయన చూపిన మార్గంపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మోయిన్ రజా, అలీమ్ రజా, కలీం, బాకీ, హమీద్‌తోపాటు ముస్లింపెద్దలు యువకులు పాల్గొన్నారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, పట్టణ సీఐ వెంకటనారాయణ, సిబ్బందితో కలిసి భద్రతను పర్యవేక్షించారు.
Milad Un Nabi | బాన్సువాడలో..
అక్షరటుడే, బాన్సువాడ : మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు (మిలాద్ ఉన్ నబీ) పురస్కరించుకొని పట్టణంలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు మాట్లాడుతూ.. మహమ్మద్ ప్రవక్త చెప్పిన మానవత్వం, ప్రేమ, శాంతి, ఏకత్వం వంటి విషయాలను వివరించారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు జులూస్‌లో పాల్గొన్నారు. మసీదుల నుంచి ప్రత్యేకంగా బైక్‌ర్యాలీ(Bike Rally) నిర్వహించారు. యువకులు మంచినీరు, డ్రింక్స్, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌస్ పాషా, ఎజాజ్, వాహబ్ తదితరులు పాల్గొన్నారు.