Homeలైఫ్​స్టైల్​Rakhi Festival | రాఖీ బహుమతులు.. మీ సోదరి రాశికి సరిపోయే పర్ఫెక్ట్ బహుమతి ఇదే..!

Rakhi Festival | రాఖీ బహుమతులు.. మీ సోదరి రాశికి సరిపోయే పర్ఫెక్ట్ బహుమతి ఇదే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Rakhi Festival | రాఖీ పండుగ అంటేనే అన్న తమ్ములు, అక్క చెల్లెల (Brother and Sister) ప్రేమకు ప్రతీక. ఈ పవిత్రమైన రోజున అక్కాచెల్లెళ్లకు బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ. అయితే, ఎలాంటి బహుమతి ఇవ్వాలి అనే సందిగ్ధంలో చాలామంది ఉంటారు. అందరికీ ఒకే రకమైన బహుమతి కాకుండా, వారి వ్యక్తిత్వానికి, ఇష్టాలకు తగినట్లుగా బహుమతిని (Gift) ఎంచుకుంటే అది మరింత ప్రత్యేకంగా ఉంటుంది. మీ సోదరి రాశిని (Zodiac) బట్టి ఏ బహుమతులు ఇవ్వాలో తెలుసుకుందాం.

Rakhi Festival | అందరికీ నచ్చే బహుమతులు

మేష రాశి: ఈ రాశివారు సాహసాలను, కొత్త అనుభవాలను ఇష్టపడతారు. వారికి అడ్వెంచర్ ట్రిప్ లేదా ఇష్టమైన స్పోర్ట్స్ యాక్టివిటీకి సంబంధించిన బహుమతి ఇవ్వండి.

వృషభం: వీరు ఖరీదైన, నాణ్యమైన వస్తువులను కోరుకుంటారు. డిజైనర్ పర్స్ లేదా మంచి ఆభరణాలు బహుమతిగా ఇవ్వవచ్చు.

మిథునం: మిథున రాశివారు ఎప్పుడూ సంతోషంగా, ఉత్సాహంగా ఉండేవారు. వారికి కొత్త పుస్తకాలు, వినోదాత్మక గ్యాడ్జెట్లు లేదా ప్రత్యేకమైన డెకరేటివ్ ఐటెమ్స్ ఇవ్వండి.

కర్కాటకం: వీరు చాలా సున్నిత మనస్కులు, సెంటిమెంట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చేతితో తయారు చేసిన బహుమతులు, ఫొటో ఫ్రేమ్‌లు లేదా భావోద్వేగంతో కూడిన పెయింటింగ్స్ ఇస్తే చాలా సంతోషిస్తారు.

సింహం: వీరు కళలు, సంగీత ప్రియులు. సంగీత పరికరం, కచేరీ టికెట్లు లేదా మంచి స్పీకర్స్ బహుమతిగా ఇవ్వవచ్చు.

కన్య: వీరు తమ ఆరోగ్యం, శారీరక సౌందర్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. వారికి స్కిన్ కేర్ కిట్, ఫిట్‌నెస్ బ్యాండ్ లేదా ఆర్గానిక్ ఉత్పత్తులు ఇవ్వండి.

వృశ్చికం: వీరు కూడా ఖరీదైన వస్తువులను ఇష్టపడతారు. మంచి బ్రాండెడ్ బట్టలు, షూస్ లేదా డిజైనర్ యాక్ససరీలు ఇస్తే వారికి చాలా నచ్చుతుంది.

Rakhi Festival | ప్రత్యేకమైన అభిరుచులకు తగిన బహుమతులు:

ధనుస్సు: వీరు ప్రయాణం అంటే ఇష్టపడతారు. టూర్ ప్యాకేజీ, ట్రావెల్ కిట్ లేదా కొత్త ప్రదేశానికి ప్రయాణించేందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తే అది వారికి ఉత్తమ బహుమతి.

మకరం: వీరు సంగీత ప్రియులు. మంచి హెడ్‌ఫోన్స్ లేదా సౌండ్ సిస్టమ్స్ ఇస్తే ఆనందంగా ఫీల్ అవుతారు.

కుంభం: టెక్నాలజీ అంటే వీరికి చాలా ఇష్టం. లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్, గ్యాడ్జెట్లు లేదా ఇష్టమైన ఛారిటీకి వారి పేరు మీద విరాళం ఇస్తే చాలా సంతోషిస్తారు.

మీనం: ఈ రాశివారు కళలకు, సాహితీరంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారికి కళాఖండాలు, ప్రముఖ రచయిత పుస్తకాలు ఇవ్వడం ద్వారా వారిని ఆనందపరచవచ్చు.