అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rakesh student suicide notes | కర్ణాటకలోని Karnataka శివమొగ్గ జిల్లా సోరబ్ తాలూకా కైసోడి గ్రామంలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. డిగ్రీ పూర్తి చేసుకున్న ఓ యువకుడు తన నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడగా.. మరణానికి ముందు వాట్సాప్‌లో అతడు ఉంచిన సందేశం ఇప్పుడు విద్యా వ్యవస్థపై విస్తృత చర్చకు దారితీసింది.
మృతుడిని రాకేష్ (21)గా గుర్తించారు. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న రాకేష్.. ఒత్తిడి, ఆత్మవిశ్వాస లోపంతో తీవ్రంగా మానసికంగా కుంగిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అతడు తీసుకున్న అఘాయిత్య నిర్ణయం అందరినీ కలచివేసింది.
Rakesh student suicide notes | గ్రాడ్యుయేట్ బలవన్మరణం..
రాకేష్ Rakesh తన సూసైడ్ నోట్‌లో కన్నడ సూపర్ స్టార్ యష్ జీవిత ప్రయాణాన్ని ప్రస్తావించడం విశేషంగా మారింది. ప్రముఖ టీవీ షో ‘వీకెండ్ విత్ రమేశ్’ కార్యక్రమంలో యష్ పంచుకున్న తన కష్టాలు, పోరాటాలు విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేవిగా ఉన్నాయని రాకేష్ పేర్కొన్నాడు. ఇలాంటి నిజ జీవిత గాథలను పాఠశాల విద్యా సిలబస్‌లో భాగం చేయాలని, అలా చేస్తే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తన చివరి సందేశంలో సూచించాడు.
అంతేకాదు.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలపై అవసరానికి మించి ఒత్తిడి తీసుకురావద్దని రాకేష్ విజ్ఞప్తి చేశాడు. “ద్రోణాచార్యుడు అర్జునుడిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినట్లుగా, నేటి విద్యా విధానం కూడా ప్రతి విద్యార్థిలోని ప్రత్యేకతను గుర్తించాలి” అని పేర్కొన్నాడు. చదువు అనేది కేవలం డబ్బు సంపాదనకే పరిమితం కాకుండా, విద్యార్థులు తమ అభిరుచులకు అనుగుణంగా ఎదగడానికి దోహదపడాలని అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్‌లో Internet విస్తరిస్తున్న కొన్ని ‘మెంటల్ గైడెన్స్’ వీడియోలు, కంటెంట్ తనలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించాయని రాకేష్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మానసిక ఆరోగ్యానికి హానికరమైన అసహజ కంటెంట్‌పై నియంత్రణ ఉండాలని కూడా కోరాడు. ఈ ఘటనపై సోరబ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాకేష్ కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ అందిస్తున్నామని, యువత మానసిక ఆరోగ్యంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పోలీసులు పేర్కొన్నారు.