అక్షరటుడే, బోధన్: Bodhan | బోధన్ మున్సిపాలిటీ (Bodhan Municipality) ఇన్‌ఛార్జి కమిషనర్‌గా ఆర్మూర్ మున్సిపాల్ కమిషనర్ (Armoor Municipal Commissioner) రాజుకు బాధ్యతలు అప్పజెప్పారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం బోధన్ మున్సిపాలిటీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. వానాకాలం సీజనల్ వ్యాధులు (Seasonal diseases) ప్రబలే అవకాశాలున్నందున ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వర్షాలు కురుస్తున్నందున మున్సిపల్ సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గతంలో ఇక్కడ మున్సిపల్ కమిషర్‌గా పనిచేసన కృష్ణ జాదవ్ (Krishna Jadhav) సస్పెన్షన్‌కు గురయ్యారు. బోధన్‌కు రాకముందు ఆయన ఆదిలాబాద్‌లో రెవెన్యూ ఆఫీసర్‌గా (Revenue Officer) విధులు నిర్వహించారు.
ఆ సమయంలో ఇంటినంబర్ల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డట్లుగా ఆరోపణలున్నాయి. అలాగే లేని స్థలానికి ఇంటినంబర్ ఇవ్వడం లాంటి పనులపై మున్సిపల్‌శాఖకు ఫిర్యాదులు వెళ్లగా ఆయనపై విచారణ జరిపిన అధికారులు ప్రస్తుతం బోధన్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయనను విధుల నుంచి తొలగించారు.