అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Rajiv Jyoti Sadbhavana Yatra | రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర గురువారం సాయంత్రం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా సద్భావన యాత్రకు కాంగ్రెస్ భవన్ (Congress Bhavan)లో పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ (Ram Bhupal), క్రమశిక్షణ కమిటీ మెంబర్ రామకృష్ణ స్వాగతం పలికి రాజీవ్ గాంధీకి (Rajiv Gandhi) ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ వక్ఫ్ బోర్డు(Waqf Board) ఛైర్మన్ జావీద్ అక్రమ్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష, గాజుల సుజాత, మలైకా బేగం, ఎన్ఎస్యూఐ నాయకులు సాయి కిరణ్, శివ, అపర్ణ, మహమ్మద్ అసద్, పుప్పాల విజయ, ఉల్లెంగ నాగరాజు,ముశ్షు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
