అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Special Officer | ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ అధికారి రాజీవ్‌గాంధీ హనుమంతు (Rajiv Gandhi Hanumanthu) నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా ఆయన మొన్నటి వరకు జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. జూన్ 13న ఆయనను ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రెటరీగా పని చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించినట్లు సమాచారం.
