అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Mla Sudarshan Reddy | ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ భవన్లో రాజీవ్‌గాంధీ వర్ధంతి (Rajiv Gandhi’s death anniversary) సందర్భంగా ఆయన చిత్రపటం నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 18ఏళ్లకు ఓటు హక్కు కల్పించి యువతను చైతన్యవంతులను చేసిన నాయకుడు రాజీవ్‌గాంధీ అని పేర్కొన్నారు. జాతీయ విద్యావిధానాన్ని అమలు చేసి దేశాన్ని ముందుకు నడిపిన విద్యావేత్త అని కొనియాడారు. అలాగే వినాయక్‌నగర్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్(State Cooperative Union Limited) మానాల మోహన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ (Chairman of Urdu Academy) తాహెర్ బిన్ హందాన్, డీసీసీబీ ఛైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి రామ్ భూపాల్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు రామర్తి గోపి, రాష్ట్ర ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, మాజీ యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నగరంలోని హనుమాన్ జంక్షన్ వద్ద రాజీవ్‌గాంధీ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు

ఆర్మూర్ పట్టణంలో వినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో..

ఆర్మూర్ మండలం కల్లెడలో..