
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Little Hearts Movie | చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts Movie)మళ్లీ వార్తల్లో నిలిచింది. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా, సాయి మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రెండో వారంలో కూడా డీసెంట్ కలెక్షన్లను రాబడుతూ విజయవంతంగా దూసుకెళ్తోంది.
అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలోని ఒక సన్నివేశం రజనీకాంత్ నటించిన ‘శివాజీ’ సినిమాలో సీన్ మాదిరిగా ఉందని నెటిజన్లు గుర్తించారు.
Little Hearts Movie | కనిపెట్టేశారా..
రాజీవ్ కనకాల(Rajiv Kanakala)కి సంబంధించిన సీన్‌లో, ‘శివాజీ’లో చూపిన అవినీతి అధికారుల డైలాగ్స్‌నే వర్డ్ టు వర్డ్‌గా వినిపించారు. దాంతో నెటిజన్లు రెండు సీన్స్‌ని కలిపి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. ‘‘ఇది కాపీనా లేక స్పూఫా?’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2007లో శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘శివాజీ’ లో, సమాజ సేవ కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయాలనుకునే హీరోని అధికారులు తిప్పిస్తూ ఇబ్బంది పెట్టే సీన్ బాగా పాపులర్. అదే సీన్‌ని ‘లిటిల్ హార్ట్స్’లో టైటిల్ కార్డ్స్ Title Cardsపడే సమయంలో అచ్చుగుద్దినట్లు దించేయడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో దర్శకుడు సాయి మార్తాండ్(Director Sai Marthand) వరకూ చేరింది. ఆయన కూడా దీనిపై ఫన్నీగా స్పందించారు. ‘‘కనిపెట్టేశారా’’ అంటూ కామెంట్ చేసి అభిమానులను నవ్వించారు. దీంతో ఇది కాపీ కాదని, ఫన్ కోసం స్పూఫ్‌గా ఉద్దేశపూర్వకంగా పెట్టిన సీన్ అని క్లియర్ అవుతోంది.
అయితే, ప్రేక్షకులు మాత్రం దీనిపై ఫన్నీగా స్పందిస్తూ.. ‘‘భలే మోసం చేసావ్ రా సాయి’’, ‘‘మక్కీకి మక్కీ దింపేశావ్’’ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఏదేమైనా, కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారింది. మొత్తానికి, ‘లిటిల్ హార్ట్స్’ చిన్న సినిమా అయినా.. ఇప్పుడు కంటెంట్‌తో పాటు స్పూఫ్ సీన్స్(Spoof Scenes) కారణంగా కూడా హైలైట్ అవుతోంది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లే రాబట్టింది.